వర్మ టేకింగ్ ,సినిమాటోగ్రఫీ ,సందీప్ పర్ఫార్మెన్స్వర్మ టేకింగ్ ,సినిమాటోగ్రఫీ ,సందీప్ పర్ఫార్మెన్స్రక్తపాతం ఎక్కువవడం ,ఎంటర్టైన్ మెంట్ ఉండదు

విజయవాడ చిన్న రౌడిగా ఉన్న రాధ (సందీప్ కుమార్) అప్పటికే విజయవాడలో తన ముద్ర వేసుకున్న వెంకటరత్నం దగ్గర పనిచేస్తాడు. అయితే రాధ స్వతహాగా ఎదుగుతున్న తీరుని చూసి ఈర్ష్య పడిన వెంకటరత్నం అతన్ని పిలిచి వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో వెంకటరత్నంకు చంపేసి తనకు అడ్డులేకుండా చేసుకుంటాడు రాధ. అయితే వెంకటరత్నం చావికి కారణమైన రాధని అతని మనుషులు ప్లాన్ వేసి మట్టుపెడతారు. ఇక అప్పటినుండి తన గ్యాంగ్ కు నాయకుడిగా రంగ ఉంటాడు. రాధకు సపోర్ట్ ఇచ్చిన స్టూడెంట్ లీడర్స్ గాంధి (కౌటిల్య), నెహ్రు (శ్రీతేజ్) లు సడెన్ గా అతనికి ఎదురుతిరుగుతారు. ఈ క్రమంలో గాంధిని కూడా రంగ చంపించేస్తాడు. అన్న చనిపోవడం జీర్ణించుకోలేని మురళి రంగకు స్పాట్ పెట్టాలని చూస్తాడు. ఆ క్రమంలో రంగ మళ్లీ మురళిని చంపించేస్తాడు. అన్ని శక్తులు ఒకచోట చేరి రంగను చంపించేస్తాయి. 

ఆర్జివి సినిమాలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ వంగవీటి సినిమాలో కూడా వంగవీటి రాధా, రంగ రెండు పాత్రల్లో నటించిన సందీప్ కుమార్ అదరగొట్టాడు. రాధా పాత్రకు అతను చూపించిన అభినయం వారెవా అనిపిస్తుంది. ఇక రంగ పాత్రలోనూ అదే రీతిలో చేశాడు. గాంధి నెహ్రూ, మురళిలుగా కౌటిల్య, శ్రీ తేజ్, వంశీలు బాగా చేశారు. ముఖ్యంగా మురళి పాత్రలో హ్యాపీ డేస్ వంశీ కసితో నటించాడు. ఇక రత్నకుమారిలా నయన గంగూలి పర్వాలేదు అనిపించింది.  

ఆర్జివి సినిమాల్లో అతని గురించి తప్ప పెద్దగా మాట్లాడాల్సినది ఏమి ఉండదు. తను తీసుకున్న కథ దానికి సరితూగే టెక్నికల్ డిపార్ట్మెంట్ ను వర్మ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక ఈ వంగవీటి విషయంలో వర్మ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. డైరక్షన్ పరంగా కెమెరామన్ తో తను తీసిన షాట్స్ వైజ్ సూపర్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో ప్రతి మర్డర్ కు వర్మ ఇచ్చిన బిల్డప్ షాట్ బాగున్నాయి. అయితే అవి ఎక్కువ సందర్భాల్లో వాడడం వల్ల కాస్త బోర్ అనిపిస్తుంది. మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. అయితే హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్, పెళ్లి సాంగ్ లేకుంటే బాగుండేది. దాసరి కిరణ్ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.  
విజయవాడ రౌడియియం మీద సినిమా తీస్తూ దానికి వంగవీటి అనే టైటిల్ పెట్టిన ఆర్జివి ముందు నుండి సినిమా ఓ సంచలనంగా ఉంచాడు. వంగవీటి రాధా, రంగల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ వంగవీటి సినిమాగా బాగుంది అనిపించొచ్చు. రాధ పాత్ర ఎండ్ అయ్యే వరకు సినిమా సూపర్ అనేలా ఉంటుంది. ఇక రంగ క్యారక్టర్ ను కాస్త తగ్గించి రాసుకున్నాడని అనిపిస్తుంది. అసలు వంగవీటి రంగ కు ఉన్న ఫాలోయింగ్ ను చూపించడంలో వర్మ సక్సెస్ అవలేదు.


రంగ పాత్రను కాస్త తగ్గించి చూపించినట్టు ఉంటుంది. ఇక సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఓ మర్డర్ అది కూడా కాస్త సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. సందీప్ కుమార్ రాధగా చేసినప్పుడు క్యారక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. అయితే రంగ పాత్రలో అంత ఇంప్రెషన్ కొట్టేయలేదు. రక్తచరిత్రలను కథలుగా సినిమాలు తీయడంలో వర్మ స్టైలే వేరు. కొన్ని సీన్స్ వర్మ స్టైల్ ను చూపిస్తాయి. 


ప్రతి ఫ్రేం లో వర్మ మార్క్ టేకింగ్ కనబడుతుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఉన్న ఇంటెన్సిటీ కొద్ది కొద్దిగా పోతుంది. అప్పట్లో విజయవాడ లొకేషన్స్ లా ఎక్కడెక్కడో బాగానే షూట్ చేశారు. అయితే ఫైనల్ గా వినిపిస్తున్న మాట ఏంటంటే ఆర్జివి ఆ మర్డర్ లు జరుగడానికి గల కారణాలు అసలు విషయం పక్కన పెట్టేసి మిగతా అంతా చూపించాడని అంటున్నారు. అయితే అవి చూపిస్తే బాగోదనే ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు.


చివరకు రంగ హత్యకు ఎవరు కారణం అన్నది కూడా ఇంకా ఓ సమాధానం దొరకని ప్రశ్నలానే మిగిల్చి అందరు డౌట్ పడేలా చేశాడు. 


Sandeep Kumar,Vamsi Nakkanti,Vamsi Chaganti,Naina Ganguly,Ram Gopal Varma,Dasari Kiran kumar,Ravi Shankarవర్మ స్టైల్ ఆఫ్ టేకింగ్ తో వంగవీటి..!

మరింత సమాచారం తెలుసుకోండి: