పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో వినోదానికి పెద్ద పీట వేస్తాడు. తనదైన మేనరిజం, డైలాగులుతో అభిమానులకు వినోదం పంచడానికి కృషి చేస్తాడు.  కాగా, పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కుటుంబ కథా నేపధ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో వినోదానికి లోటు లేకుండా చూస్తున్నాడు. త్రివిక్రమ్ శైలీ పంచ్ డైలాగులతో ఈ సినిమా సరదా సరదాగా సాగుతుందని చెపుతున్నారు. అందుకే ఈ సినిమాకు ‘సరదా’ అనే టైటిల్ నిర్ణయించినట్లు తాజా సమాచారం. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’, ‘జల్సా’ ిచిత్రాలు మంచి హిట్ సాధించాయి. దీంతో సెంటిమెంట్ గా దాదాపుగా అదే అర్థాన్ని ఇచ్చే ‘సరదా’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ ‘సరదా’ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సమంతా హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె తల్లి పాత్రను నదియా పోషిస్తుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రణీత నటిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: