దర్శకుడు విష్ణువర్థన్ చిత్రంలో నటిస్తున్నాడు అజిత్. ఆ తరువాత మరో పెద్ద దర్శకుడు ఇటీవలే అజిత్ కి ఓ కథ వినిపించి ఓకే అనిపించుకున్నట్టు చెన్నై వర్గాల సమాచారం. అయితే, ఓ షరతు మేరకే అజిత్ ఆ చిత్రం అంగీకరించాడట. అదేంటంటే... తన జుత్తుకి రంగు వేసుకోవాలని అడక్కూడదు. అవును, ‘మంగాత’లో అజిత్ హెయిర్ డై వేసుకోకుండా నెరిసిన జుత్తుతోనే తెరపై కనిపించాడు. ఇలా అయితే అభిమానులను ఆకర్షించలేరని ఎంతమంది చెబుతున్నా అజిత్ వాటిని పట్టించుకోలేదు. జుత్తుకి రంగు వేసుకోలేదు. ఈ చిత్రం తమిళ నాట సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో అజిత్ కి తెల్ల జుత్తు ఓ సెంటిమెంటుగా మారిపోయింది. అందుకే, తను ఏ దర్శకుడైనా చెప్పే కథను వినబోయే ముందుగానే ‘నా జుత్తుకి రంగు మాత్రం వేయమని అడగొద్దు’అంటున్నట్టు సమాచారం. భలే సెంటిమెంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: