సినిమా... కళ అనే స్టేజిని దాటిపోయి వ్యాపార స్థాయికి ఏనాడో చేరుకుంది. సినిమా వ్యాపారం అంటేనే కాస్ట్లీ జూదం. 2 కోట్ల సినిమా 50 కోట్లు కలెక్ట్ చెయ్యొచ్చు, 50 కోట్లు పెట్టి తీసిన సినిమా 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోవచ్చు. నిన్నటి కామెడీ యాక్టర్ రేపు 100 కోట్ల నిర్మాత కావచ్చు ఒకప్పుటి మెగా నిర్మాత ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా పోవచ్చు. ఈ ఆట ఆడాలంటే చాలానే మెలుకువలు కావాలి , కానీ అలాంటి కిటుకులన్నిటినీ మిక్సీ లో వేసి జ్యూస్ చేసుకొని తాగేశాడా అనిపిస్తుంది జబర్దస్త్ నిర్మాత బెల్లoకొండ సురేష్ ని చుస్తే. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా, టాలీవుడ్ పెద్దగా, ఈయన గారి పేరు తలవకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ నెల గడవనే-గడవదు. ఈ ఉపోద్గాతం అంతా ఏంటంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా... పెద్ద హీరో తో సినిమా అంటే ఖర్చు కోట్ల లో అవుతుంది, అందులోనూ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమా అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే నిర్మాతలు పెద్ద హీరోల పారితోషకాన్ని 3 - 4 దపాలుగా చెల్లించుకుంటారు. కానీ మన బెల్లంకొండ సినిమా మెదలు కూడా కాక ముందే యంగ్ టైగర్ పారితోషకాన్ని[దాదాపు 15 కోట్లు] సింగిల్ పేమెంట్ లో సెటిల్ చేశాడట, అందుకే ఈయన బెల్లంకొండ కాదు బంగారుకొండ కాదంటారా?  

మరింత సమాచారం తెలుసుకోండి: