మహిళ దర్శకురాలు జయ రెచ్చిపోయింది. ‘సుకుమారుడు’ ఆడియో ఫంక్షన్ లో జయ పాల్గొంది. అక్కడ ఆమె మాటల్లో రెచ్చిపోయింది. ఏమీ మాట్లాడుతుందో ఆమెకు తెలియనంతగా రెచ్చిపోయింది. ఆదివారం నాడు సాయికుమార్ కుమారుడు ఆది నటించిన ‘సుకుమారుడు’ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయికుమార్, బెల్లంకొండ సురేష్, నాని, వరుణ్ సందేశ్, సుదీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో దర్శకురాలు జయ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిని ఆకాశానికి ఎత్తేసింది. గతంలో కంటే ఆది ఈ ‘సుకుమారుడు’లో డాన్సులు బాగా చేశాడని కితాబు ఇచ్చింది. అంతే కాకుండా సినిమా రంగంలో డాన్సుల్లో ఆది నెంబర్ వన్ అని ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ‘ఏ హీరో అయినా, ఎంత పెద్ద హీరో అయినా ఆది కి పోటీకి రమ్మనండి. ఛాలెంజ్’ అంటూ వేదిక మీదనే సవాలు విరిసింది. ఏ సినిమా ఫంక్షన్ లోనైనా ఆ హీరోను పొగడుతూ మాట్లాడ్డం సహాజమే కానీ, అక్కడ ఉన్నవారంతా జయ మాటలు చూసి ఈవిడ ఇంతగా రెచ్చిపోతుందేమిటీ.. అని ఆశ్చర్యపోయారు. గతంలో ఈవిడ గారు ఆదితో ‘లవ్లీ’ అనే సినిమాను రూపొందించారు. మళ్లీ ఇంకొక సినిమా చాన్సు కోసమే సాయికుమార్  తనయుడిని ఇలా ఆకాశానికి ఎత్తేస్తుందని కామెంట్లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: