ఇప్పుడు అందరి దృష్టి శ్రీను వైట్ల మీద ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీను వైట్ల రూపొందించిన బాద్ షా సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో వినోదం అందర్నీ విపరీతంగా ఆలరిస్తుంది. బాద్ షా సినిమాతో కామెడీ పై తనకు ఉన్న పట్టును శ్రీను వైట్ల మరోసారి చూపించాడు. కాగా, శ్రీను వైట్ల తన సినిమాలో కామెడీ సీన్లుకు నాగార్జునే కారణం అంటున్నాడు. బాద్ షా విజయవంతం సందర్భంగా మీడియా ప్రతినిధులతో శ్రీను వైట్ల మాట్లాడాడు. ‘ నా సినిమాల్లో కామెడీ సీన్లు బాగుంటాయని అంతా అంటారు. దీనికి కారణం నాగార్జునే’ అని తెలిపారు. తాను మొదట్లో రూపొందించిన ‘నీ కోసం’ సినిమాను చూసిన నాగార్జున సినిమా అంతా బాగుందని, అయితే ప్రేక్షకుల నవ్వుకునేటట్లు కూడా సినిమా ఉంటే బావుండునని అని అన్నారు. అప్పట్నుంచి తన సినిమాల్లో వినోదానికి పెద్ద పీట వేస్తున్నాని శ్రీనువైట్ల చెప్పాడు. మహేష్ తో రూపొందించనున్న ఆగడు సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని శ్రీనువైట్ల ఈ సందర్భంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: