కిరణ్ ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమా వర్గాలు, సినిమా అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన తీరుపై అందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లీష్ వాళ్లకి ‘అస్కార్’ ఎలాగో.. మన తెలుగోళ్లకి ‘నంది’ అలాంటిది. నంది అవార్డులను ఎవరికి ప్రకటించారు..., వేడుకను ఎలా నిర్వహించారు అనే విషయాలను చాలా ఆసక్తిగా గమనిస్తుంటాం. అయితే ఈ ఉగాదికి నిర్వహించిన నంది అవార్డుల ప్రధానోత్సవ వేడుక అంతా నవ్వుకునేవిధంగా ఉందని అంతా ఆక్షేపిస్తున్నారు. ఇటీవల కొన్ని భారీ సినిమాల ఆడియో వేడుకలను అత్యంత బారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహించే వేడుక ఎంత ఘనంగా ఉండాలి... ఇంకెంత ఆర్భాటంగా ఉండాలి. కానీ ఉగాది నాడు జరిగిన ‘నంది’ వేడుకను తుస్సుమనిపించారు. ఎంతో ప్రతిష్టాత్మకం అయినా వేడుకను సాదాసీదాగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగిన తీరును గమనిస్తే ఈ వేడుక మీద ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది. ప్రతీ నంది వేడుకలోనూ ముఖ్యమంత్రి ప్రసంగించడం అనవాయితీ. ప్రభుత్వంలో ఎంతో కీలకమైన ముఖ్యమంత్రి గారు ఆ రోజున తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అందించే సహకారం గురించి... సినిమా పరిశ్రమ నిర్వహించాల్సిన బాధ్యతలు గురించి మాట్లాడుతారు. అయితే ఈ సంవత్సరం అలాంటిది ఏమీ జరగలేదు. వేదిక మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రసంగించనే లేదు. ఇదీ ఈ కార్యక్రమం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ. అలాగే, తెలుగు సినిమా పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనలేదు. నాగార్జున, మహేష్ వంటి స్టార్లు ఈ కార్యక్రమానికి వచ్చి కేవలం కొన్ని నిమిషాలు గడిపి వెళ్లిపోయారు.. అటు ప్రభుత్వం, ఇటు సినీ పెద్దలు నిర్లక్ష్యం వహించడంతో నంది వేడుక అట్టర్ ప్లాప్ గా జరిగిందని కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: