తెలుగు, త‌మిళ భాష‌ల్లో మ‌ళ్లీ బిజీ అయిపోయాడు సిద్దార్థ్‌. రొమాంటిక్ హీరోయిజం పండించే పాత్ర‌ల‌కు తాత్కాలికంగా చెక్ పెట్టి... కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంచుకొంటున్నాడు. నిర్మాత‌గా తీసిన ఎన్‌హెచ్ 4 ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగా మ‌రో సినిమా ఒప్పేసుకొన్నాడు. పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో జ‌త క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కార్తిక్ సినిమా పిజ్జా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు కొల్ల‌కొట్టింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌యం సాధించింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఉన్న‌త‌మైన సాంకేతిక నైపుణ్యంతో కార్తీక్ ఆ సినిమాని తీర్చిదిద్దిన విధానం విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకొంది. అందుకే... సిద్దూ కూడా కార్తీక్‌కి ఫ్లాట్ అయిపోయాడ‌ట‌. అడ‌గ్గానే... సినిమా ఒప్పుకొన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: