అస‌లే అది చంబ‌ల్‌లోయ‌. అ పేరు చెబితే దోపిడీ ముఠా దాడులు గుర్తొస్తాయి. క‌నిపించింది దోచుకోవ‌డం, అందాల‌న్నీ అనుభ‌వించ‌డం... ఆ ముఠా స్టైల్‌. వారి చేతి చిక్కి తృటిలో త‌ప్పించుకొంది బాలీవుడ్ క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్‌. ఇది సినిమా సీన్ కాదు. నిజ్జంగా జరిగిన‌దే. కంగ‌నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న చిత్రం రివాల్వ‌ర్ రాణీ. ఈ షూటింగ్ చంబ‌ల్‌లోయ‌లో జ‌రుగుతోంది. ఇటీవ‌ల రివాల్వ‌ర్ రాణీ టీమ్‌పై ఓ ముఠా దాడి చేసింది. కంగ‌నా కారుని మార్గ‌మ‌ధ్య‌లో ఆపేశారు. కంగ‌నాని కింద‌కు దించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. అయితే ప‌రిస్థితిని గ‌మ‌నించిన యూనిట్ స‌భ్యులు... ఆ ముఠా సభ్యుల‌తో మాట్లాడి.. ఈ వ్య‌వ‌హారం చేయిదాట‌కుండా చూశారు. ముందుగానే వాళ్లు అడిగింది ఇచ్చి... గొడ‌వ జ‌రక్కుండా సాగ‌నంపారు. ఇంత‌కీ కంగ‌నా కారు దిగితే... ప‌రిస్థితి ఏమిటో??  

మరింత సమాచారం తెలుసుకోండి: