బాహుబ‌లి కోసం రాజమౌళి భారీ ఎత్తున క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ సినిమాలో తారాగ‌ణం విష‌యంలో ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నారు. ప్ర‌తి పాత్ర‌కూ స‌రైన న‌టుడి కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాలో మ‌రో న‌టుడికి ఛాన్స్ దొరికింది. ఈగ విజ‌యంలో కీల‌క పాత్ర వ‌హించిన సుదీప్‌ని ఓ కీల‌క‌మైన పాత్ర కోసం ఎంచుకొన్నారు. అయితే ఈ సినిమాలో ఆయ‌న పాత్ర పాజిటివ్‌గానే ఉంటుంద‌ట‌. ఈగ సినిమాని నెత్తిమీద వేసుకొన్న‌సుదీప్‌.. బాహుబ‌లిలో ఏం చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: