బాద్‌షా 50 కోట్ల టార్గెట్‌పై నీళ్లు చ‌ల్లాడు.. నితిన్‌. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకుపోతుండ‌డంతో... బాద్‌షా వ‌సూళ్ల‌కు గండి ప‌డింది. బాద్‌షా థియేట‌ర్ల‌న్నీ జనాలు లేక వెల‌వెల‌బోతున్నాయి. షాడో వ‌చ్చే వ‌ర‌కూ ఏదోలా బండి న‌డిపించేద్దాం.. అనుకొంటే నితిన్ సినిమా వ‌చ్చి బాద్‌షా కంటికి కునుకు లేకుండా చేశాడు. అంతే కాదు... కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బాద్‌షా రికార్డులు తిర‌గ‌రాసే ప‌నిలో ప‌డింద‌ట‌. నితిన్ తెలంగాణ హీరో. అక్క‌డి నుంచి వ‌చ్చి... కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించుకొన్న హీరో. అందుకే.. ఆ దృష్టితోనూ తెలంగాణ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాకి బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నార‌ట‌. అంతేకాదు.. మెగా అభిమానుల అండ‌దండ‌లు కూడా ఈ సినిమాకే ఉన్నాయి. గౌర‌వం సినిమాకి కూడా వ‌దలేసి.. జనం గుండెజారి గ‌ల్లంత‌య్యిందేపై దృష్టి పెట్టారు. దాంతో... వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తోంది. మొత్తానికి నితిన్‌... ఎన్టీఆర్‌కే ద‌డ పుట్టించేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: