బాలీవుడ్లో ఖాన్ త్రయంలో ఎప్పుడూ కీచులాటలే. నెంబర్ వన్ స్థానం కోసం వారి మధ్య కోల్డ్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ అయితే... ప్రత్యక్షంగానూ పోట్లాడుకొంటుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని కాలర్ పట్టుకొన్న సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరి మధ్య పోటీ చూడాల్సిందే. ఒకరి స్థానానికి మరొకరు ఎసరు పెట్టుకోవడం కూడా కామనే. ఈసారి సల్మాన్ స్థానానికి ముప్పు తెచ్చాడు షారుఖ్.
ప్రముఖ హిందీ ఛానల్లో.. పాపులర్ అయిన బిగ్‌బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు షారుఖ్. ఆ పోగ్రామ్ మంచి రేటింగులతో సాగుతోంది. అయితే ఇప్పుడు సల్మాన్ స్థానంలో షారుఖ్‌ని తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దానికీ కారణం ఉంది. సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ కార్యక్రమానికి సమయం కేటాయించే స్థితిలో లేడు. అందుకే బిగ్‌బాస్ నుంచి సల్మాన్ తప్పుకోవాలని యోచిస్తున్నాడు. ఆ స్థానంలో షారుక్ రాబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాని షారుఖ్ ఎలా రక్తికట్టిస్తాడో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: