శ్రీ‌నువైట్ల సాధించిన విజ‌యాల్లో ఆయ‌న ఆస్థాన ర‌చ‌యిత‌ల‌కూ వాటా ఉంటుంది. కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, బి.వి.ఎస్ ర‌వి... పంచ్‌లే శ్రీ‌నువైట్ల సినిమాల‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ ముగ్గురూ చెరో దారి వెతుక్కొన్నారు. కోన‌, గోపీ ద‌ర్శ‌కులైపోయారు.

ర‌వి కూడా వాంటెడ్ సినిమా కోసం మెగాఫోన్ ప‌ట్టిన‌వాడే. ఇప్పుడు నిర్మాత‌గా మారి.. సెకండ్ హ్యాండ్ సినిమా తీశాడు. ఇదో సెటైరిక‌ల్ కామెడీ సినిమా అట‌. నూత‌న తారాగ‌ణంతో తెర‌కెక్కించారు. చాలా ఇన్నోవేటివ్ ఆలోచ‌న‌ల‌తో ఈ సినిమా రూపొందించార‌ట‌. ప్ర‌చార చిత్రాలు కూడా కాస్త కొత్త‌గా ఉన్నాయి. సుబ్బారావ్‌... అనే పాట‌ను సింగిల్ టేక్‌లో షూట్ చేశార‌ట‌. ఇన్ని... ప్ర‌త్యేక‌త‌ల ఈ సినిమా మేలో విడుద‌ల కానుంది.

ద‌ర్శ‌కుడిగా ప‌రాజ‌యం పొందిన‌.. ర‌వికి నిర్మాత‌గా అయినా కాలం క‌లిసొస్తుందో లేదో??

మరింత సమాచారం తెలుసుకోండి: