సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక్కడ విజయమే ప్రధానం. ఈ విజయం కోసమే దర్శకుడు ఎస్ కె బషీద్ దారుణానికి ఒడిగట్టాడని హీరోయిన్ రుషికా సింగ్ ఆరోపిస్తుంది.

బషీద్ దర్శకత్వం వహించిన ‘బెంకి బిరుగాలి’ అనే సినిమాలో రుషికా సింగ్ నటించింది. అయితే సినిమాకు బాగా ప్రచారం రావడం కోసం దర్శకుడు బషీద్  తన మొహంతో కూడా ఫేక్ పోర్న్ వీడియోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడని హీరోయిన్ రుషికా సింగ్ ఆరోపిస్తుంది. ఈ విషయంపై ఆమె మీద బెంగుళూరు సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

ఈ విషయం కన్నడ చిత్ర సీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వాస్తవం ఏదైనా.. చిత్ర విజయం కోసం ఇలాంటి ఆలోచన చేయడం దురదృష్టంగా అంతా భావిస్తున్నారు.

కాగా, హీరోయిన్ రుషికా సింగ్ ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.వి.రాజేంద్ర సింగ్ కుమార్తె. ఆమె సోదరుడు ఆదిత్య కూడా కన్నడ చిత్ర సీమలో రాణిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: