Star cast: VenuKamalinee Mukherjee Director: Eeshwar
 

Ramachari Reviews:  Tweet Review |  తెలుగు ట్వీట్ రివ్యూ |  English Full Review


చిత్రకథ : 

బాంబ్ స్క్వాడ్ పోలీసు అధికారి  చంద్రమోహన్ కుమారుడు రామాచారి(హీరో వేణు), తను పోలీసు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. టెర్రరిస్టులు ముఖ్యమంత్రి బాలయ్యను టార్గెట్ చేసుకుంటారు. టెర్రరిస్టుల ప్రయత్నాలను  వేణు అడ్డుకుంటుండడంతో కథ నడుస్థుంది. ఇంతకు వేణు పోలీసు అయ్యారా, ఉగ్రవాదుల కథ ఎక్కడికి చేరింది అనేది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే. 

నటీనటుల ప్రతిభ :

వేణు పాత్రకు తగ్గట్లుగా నటించారు. హీరోయిన్ కమలిని ముఖర్జీ పాత్ర సినిమాకు అవసరం లేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టి ఆమే కోసం ఓరెండు పాటలు పెట్టారు. సీన్ ను బట్టి కామెడి పండించారు. ఫైట్లతో కూడా అలరించాడు. బ్రహ్మానందం కామెడి పండించడంలో సఫలమయ్యారు. బ్రహ్మితో పాటు అలీ మంచి నవ్వులు పండించాడు. మరో హాస్యనటుడు రఘుబాబు పిచ్చోడుగా చేసిన నటన ఈసినిమాలో పేలింది. ఇక చంద్రమోహన్, గిరిబాబు, సుత్తివేలు వంటివారు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

డెరెక్టర్ ఈశ్వర్ పని తీరు బాగాలేదు, స్టార్ కమెడియన్లను పెట్టుకుని వారికి తగ్గ పాత్రలను ఇవ్వలేకపోయారు. జోకులు ఫుల్లుగా ఉన్నా... నవ్వలేక పోయారు ఆడియన్స్. మణిశర్మ లాంటి మంచి సంగీత దర్శకుడు ఉండి కూడా మంచి పాటలు, సంగీతం అందించలేకపోయారు. ఫోటోగ్రఫి, స్క్రీన్ ప్లే ప్లాప్. మాటలు కొన్ని పేలేలా ఉన్నా వాటిని సందర్బోచితంగా పెట్టలేదు.

హైలెట్స్ : 

వేణు, బ్రహ్మానందం, రఘుబాబు, అలీ ల నటన.అక్కడక్రడా కామెడి సీన్లు.

డ్రాబ్యాక్స్ : 

కథ లేకపోవడం, అవసరానికి మించి పాత్రలు పెట్టడం

విశ్లేషణ : 

కామెడీ కోసం ప్రయత్నించి టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్లను అవసరానికి మించి పెట్టి నవ్వించలేక పోగా, బోర్ కొట్టించింది. టెర్రరిస్టులు, బాంబులు, భయం గొలిపే విధంగా చూపించాలని ప్రయత్నించి దానికి కూడా కామెడి ఫినిషింగ్ ఇచ్చి పరమచెత్త చేసారు. నటీనటులు వారికిచ్చిన పాత్రలకు తగినట్లుగా నటించినప్పటికి సరైన సీన్లు లేక పోవడం సినిమాను ప్లాఫ్ చేసింది.

చివరగా :

సినిమాకు వెల్లడమే కాదు, కనీసం డివిడి కోసం కూడా ప్రయత్నించక పోవడం బెటర్ ఎందుకంటే జోకులు ఫుల్లు-నవ్వులు నిల్లు అన్నట్టుగా ఉంది సినిమా.
 

Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Ramachari | Ramachari Wallpapers | Ramachari Videos

మరింత సమాచారం తెలుసుకోండి: