సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'కోచ్చడయాన్' విడుదలకు రెడీ అవుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమే కాకుండా ప్రపంచ సినీ పరిశ్రమ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. క్యాప్చర్ ఫార్మెట్‌లో హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో తెరకెక్కుతున్న తొలి భారతీయ త్రీడీ చిత్రం. రజినీ రెండవ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంది. అదేంటీ రజినీ సినిమాకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటనుకుంటున్నారా..? అవును 'కోచ్చడయాన్' చిత్రాన్ని చూసి మార్పులు చేర్పులు చెప్పాలంటూ తన మిత్రుడు కమల్ ను రజనీకాంత్ ఆహ్వానించాడు. కమల్ సినిమా చూసి సంతృప్తి చెందితే సినిమాను వెంటనే విడుదలకు సిద్ధం చేయాలనుకుంటున్నారు.

కోలీవుడ్ కు రజినీకాంత్-కమల్ హాసన్ రెండు కళ్లులాంటి వారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. హీరోలుగా బాలచందర్ శిష్యరికంలో ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. పోటాపోటీగా ఎదుగుతూ వచ్చారు. నటన విషయంలో, పాపులారిటీ విషయంలో ఎవరి ప్రత్యేకత వారిది. అయితే కమల్, రజనీలు ప్రసుత్తం కలసి నటించకపోయినా ఒకరి సినిమాల కోసం మరొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారు. అయితే తాజాగా రజినీ ఆహ్వానం మేరకు.. కమల్ హాసన్ ప్రివ్యూ చూసి తన నిర్ణయాన్ని చెబితే సినిమా నిర్మాణం కంప్లీట్ అయినట్టే.

విభిన్న అవతారంలో కనిపించే ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే అభిమానులతో సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి. మరి రజినీ.. కొత్త సినిమాతో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో ఈ అతి త్వరలోనే తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: