ఒక‌ప్పుడు సూప‌ర్ మేన్ అంటే హాలీవుడ్ నుంచే రావాలి. కానీ ఇప్పుడ‌లా కాదు. మ‌న‌కూ ఓ సూప‌ర్ మేన్ దొరికాదు. అత‌డే హృతిక్ రోష‌న్.  కోయిమిల్ గ‌యా , క్రిష్ లాంటి సినిమాల‌తో సూప‌ర్ మేన్ గా అవ‌త‌రించాడు హృతిక్ రోష‌న్. ఈ రెండు సినిమాల‌కు కొన‌సాగింపుగా  రూపొందిన క్రిష్3 శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
క్రిష్ కి మించి క్రిష్3 వుంటుంద‌ని, హృతిక్ ఫైట్స్ ఒళ్లు గ‌గుర్పోడిచే విధంగా వుంటాయని డైరెక్టర్ అంటున్నాడు.  రాకేష్ రోష‌న్ స్వీయ ద‌ర్శక‌త్వంలో రూపొందించిన ఈ సినిమాలో హృతిక్ కి జోడిగా మ‌రోసారి ప్రియాంక చోప్రా న‌టించింది. వివేక్ ఒబ‌రాయ్, కంగ‌నా రనౌత్ ముఖ్య పాత్రల్లో న‌టించారు.
షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ ప్రస్తుతం న‌డుస్తోంది. దీపావ‌ళి కానుక‌గా క్రిష్ ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. మ‌రి క్రిష్3లో హృతిక్ విన్యాసాలు ఏరేంజ్ లో వుంటాయో చూడాలంటే దీపావ‌ళి దాకా ఆగ‌క‌త‌ప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: