హిట్ కోసం అర్రులు చాస్తున్న హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉన్నాడు. వరుస పరాజయాలు వెక్కిరిస్తుండటంతో ఈ మాస్ మాహారాజ్ ఢీలాపడిపోయాడు. ఎలాగైన హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. హీరో రవితేజ ప్రస్తుతం ‘బలుపు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. లేకపోతే సినిమా జనాలు రవితేజ అనే హీరో ఉన్నాడనే విషయం మర్చిపోతారు. ఈ విషయం తెలుసుకాబట్టే ‘బలుపు’ పై రవితేజ తన పూర్తి శక్తులు పెడుతున్నాడు. తనకు చేతనైనవి అన్నీ పూర్తి స్థాయిలో ప్రదర్శస్తున్నాడు. బలుపు చిత్రం కోసం రవితేజ గాయకుడిగా మారి పాట పాడుతున్నాడు. రవితేజ పాడిన పాట బలుపు సినిమా కు ప్రత్యేక ఆకర్షణ తెస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ నేతృత్వంలో బలుపు కోసం రవితేజ పాట పాడాడు.

కాగా, ఈ సినిమా ఆడియోను జూన్ 1న విడుదల చేస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: