Star cast: Allu ArjunAmala PaulCatherine Tresa

Director: Puri JagannadhProducer: Bandla Ganesh

Iddarammayilatho Reviews: Tweet Review | తెలుగు ట్వీట్ రివ్యూ | English Full Review

చిత్రకథ : 
హీరో సంజు (అల్లు అర్జున్), హీరోయిన్ కోమలి( అమలాపాల్) యూరప్ లో ప్రేమలో పడతారు. ఇండియా లో ఉన్న వారిరువురి తల్లితండ్రులు కూడా ఒప్పుకుని పెళ్లి ఖరారు చేస్థారు, పెళ్లి నాలుగు రోజులు ఉన్నదనగా అనుకోని ఘటన చోటు చేసుకుంటుంది, వీరిద్దరు తల్లిదండ్రులు విలన్ల చేతిలో హత్యకు గురవుతారు. వారిపై పగ తీర్చుకునే క్రమంలో మరో హీరోయిన్ ఆకాంక్ష(క్యాథరిన్) హీరోతో ప్రేమలో పడుతుంది. హీరో ఏవిధంగా పగ తీర్చుకుంటాడు...? క్యాథరిన్ కు కథకు సంబందం ఏమిటి...? హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది వెండి తెరపై చూడాల్సిందే. 

నటీనటుల ప్రతిభ :

హీరో  అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్టుగా నటించారు, లవర్ బాయ్ గా, ఆకట్టుకునే ఫైట్స్ లో మాస్ హీరోగా, అదరగొట్టే డ్యాన్స్ తో సినిమాకు ప్రాణం పోసాడు. డైలాగ్ డెలివరీ, మద్యమద్యలో తూటాల్లా పేల్చిన జోకులు సినిమాలో అర్జున్ ను ఆహా అనిపించాయి.

హీరోయిన్ అమలాపాల్ అచ్చతెలుగు అమ్మాయిలా, అమాయకత్వపు మాటలతో పాత్రకు ఒదిగిపోయింది. అదే తరహాలో హీరో కోసం వేసిన మాడర్న్ డ్రెస్ లలోను ఆమె ఆకట్టుకుంది. మరో హీరోయిన్ క్యాథరిన్ నటన కాస్తా ఎబ్బెట్టుగా ఉంది. హీరోతో ఆమె నటించిన సీన్లలో అంతగా రానించలేదు.

ఇతర ప్రధానపాత్రల్లో బ్రహ్మానందం రాణించారు. తన ఇమేజికి తగ్గ నవ్వులు పండించారు. నాజర్, రావురమేశ్, తనికెళ్ల భరణి, ప్రధాన విలన్ సోదరుని పాత్రలో సుబ్బరాజు తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించలేకపోయారు. మరో కమెడియన్ అలీ ని పెట్టినప్పటికి సరిగ్గా ఉపయోగించుకోలేదు, పైగా ఆయన పాత్ర సినిమాలో అనవసరం.

సాంకేతిక వర్గం పనితీరు :

డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా పూర్ గా డైరెక్టు చేసారు. సినిమాను ఎంత త్వరగా ముగిద్దామా అన్నట్టు తొందరతొందరగా, గజిబిజి గా సినిమాను రూపొందించారు. డైలాగులు బాగుంటాయన్న పేరు పూరికి ఉంది, కాని అందులోను ఫెయిలయ్యారు, అక్కడక్కడా కొన్ని చోట్ల డైలాగులు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీతాన్ని ప్రేక్షకులకు వినిపించడంలో సక్సెస్ అయ్యారు. మొత్తం అయిదు పాటలు బాగానే ఉండగా వాటిలో మూడు పాటలు ఇంకాస్థా బాగున్నాయి. కొరియోగ్రఫీ కూడా అభినందనీయం. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ తీయడం లో చూపిన శ్రద్ద సినిమా డైరెక్షన్ లో చూపెడితే పిక్చర్ హిట్టయ్యేదేమో అన్పించింది. కథ అంతంత మాత్రమే అయినా స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాత ఈసినిమాను ఇండియాలో కూడా ఇదే స్థాయిలో తీసే అవకాశం ఉన్నప్పటికి యూరప్ లో తీసి బాగా ఖర్చుచేసారు.

హైలెట్స్ : 

 అల్లు అర్జన్ నటన, కిచా ఫైటింగ్, దేవీశ్రీ పాటలు, బ్యాంగ్ గ్రౌండ్ స్కోర్, కొరియోగ్రఫి బాగున్నాయి, కేథరిన్ స్కన్ షో

డ్రాబ్యాక్స్ :

పూర్ డైరెక్షన్, అర్థం లేని కామెడి, పొంతనలేని కథ, ఓవర్ మేకప్, చెత్త సినిమాటోగ్రఫి

విశ్లేషణ : 

డైరెక్టర్ తన ప్రతిభను సరిగా కనబర్చలేక పోయాడు.  పూరి చాలా తొందరగా కథను ముంగించాలనే రీతిలోనే సినిమా తీశాడు.  పొంతనలేని కథ, మితిమీరిన మేకప్, అర్థరహిత కామెడీస, చెత్త సినిమాటోగ్రఫీతో చిత్రంలో చాలా సన్నివేశాలు బోర్ కొట్టించే విధంగా ఉన్నాయి. కేథరిన్ , అల్లు అర్జన్ ల మధ్య సాగే సన్నవేశాలు చాల చెత్తగా వున్నాయి.  అమలాపాల్ సంగీతం నేర్చుకొనే సన్నివేశాలు బోర్ కొట్టించే విధంగా ఉన్నాయి.  క్లైమాక్స్ ఫైట్,  అలీ కామెడీ సన్నవేశాలు పరమ బోర్. సినిమా పేరు ఇద్దరమ్మాయిలతో అని పెట్టారు కాబట్టి  ఇద్దరు హీరోయిన్లను పెట్టారు, కాని కథకు ఒక్క హీరోయిన్ సరిపోతుంది.

చివరగా : 

పూరి తీసిన ‘పూర్’ సినిమా

Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

మరింత సమాచారం తెలుసుకోండి: