12 ఫ్లాప్ సినిమాల తరువాత వరసగా “ఇష్క్”, “గుండెజారి గల్లంతైందే” సినిమాలతో అదృష్టాన్ని అందుకున్న హీరో నితిన్, తన కెరియర్ విషయంలో ఖంగారులో తప్పటు అడుగులు వేస్తున్నాడా అంటూ విమర్శకుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకులను వదిలివేసి, ప్రస్తుతం టాలీవుడ్ సినిమా రంగంలో అంతగా ఇమేజ్ లేని దర్శకులు కరుణాకరన్, సురేంద్ర రెడ్డి, నందిని రెడ్డి సినిమాలలో నటించడానికి నితిన్ అంగీకరించడం చూస్తూ ఉంటే, తన కెరియర్ తో తను మరో ప్రయోగం చేసుకుంటున్నాడా..? అని అనిపిస్తోంది. గతంలో కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా పేరుపొందిన కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అల్లరి బుల్లోడు” గా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “అడవి” లో నటించనా, పెద్ద డైరెక్టర్స్ సినిమాలు ఏమి నితిన్ కు కలిసి రాలేదు. ప్రస్తుతం మరి ఈ కొత్త ప్రయోగం నితిన్ కెరియర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో అనే విషయంపై రకరకాల ఉహాగానాలు ఉన్నాయి.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “కొరియర్ బాయ్ కళ్యాణ్” గా కనిపించడమే సాహసం అంటూ నితిన్ అభిమానులు భయపడుతూ ఉంటే, ప్రస్తుతం విజయాలను చూసి చాలా కాలం అయిన కరుణాకరన్, నందిని రెడ్డి లాంటి దర్శకులు తమకు లేని అదృష్టాన్ని నితిన్ కు ఎంతవరకు ఇవ్వగలుగుతారో చూడాలి........

మరింత సమాచారం తెలుసుకోండి: