మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా ఆ హిట్ ఎక్కువ శాతం రాజమౌళికే పోతుంది. రామ్ చరణ్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ వరసగా ఇస్తున్నా ఏదో లోటు మాత్రం చరణ్ బాబులో కొట్టిచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. యంగ్ బ్లడ్ ఆవేశాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ చరణ్ బయట కూడా చాలా వీక్ అవుతున్నాడు అన్నది అందరం ఒప్పుకోవాల్సిన సత్యం.


ఎంత వీక్ అవుతున్నాడంటే నితిన్, అల్లు అర్జున్ల వలే తన మూవీస్ కోసం పవన్ నామస్మరణ చేయక తప్పడం లేదు. తాజాగా ఓ పత్రికకు ఇచిన ఇంటర్వ్యూలో పవన్ గురించి చాలానే చెప్పుకొచ్చాడు. ఎంతలా అసలు వీళ్ళు కలిసి ఉన్నారో లేదో అనే అనుమానంలో ఉన్న మెగా ఫ్యాన్సుకి కూడా చరణ్ చెబుతుంది వింటే నిజంగా చరణ్ పై ఇద్దరి హీరోల దారిలోనే వెళుతున్నాడని అనిపిస్తుంది.


బాబాయితో నన్ను పోల్చవద్దు (ఎవరు పోల్చారో మరి). నేను కూడా బాబాయ్ అభిమానినే. ఆయన స్థాయి వేరు. నా స్టైల్ వేరు (ఇది మాత్రం నిజం). ఆయనతో పోల్చుకునేంత మెచురిటీ నాకింకా రాలేదు (నిజం ఒప్పుకున్నాడందోయ్) అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోచాడు. ఈ విషయం అందరికి ఎప్పుడో తెలుసు. మరి కొత్తగా మళ్ళీ అలానే చెబితే అందరూ ఏమనుకుంటారు. పవన్ భజన ఆఖరికి చరణ్ బాబుకి తప్పడం లేదు అనే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: