మ‌ల్టీస్టార‌ర్ హంగామా మొద‌లైంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర‌వాత - ఇద్ద‌రు ముగ్గురు హీరోల సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. మంచు హీరోలు కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్ తో ముందుకు వ‌స్తున్నారు. శ్రీ‌ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ప‌తాకం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ల‌క్ష్యం సినిమాతో హిట్టు కొట్టిన శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి గ‌లాటా అనే పేరు ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారమ్‌.

బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన గోల్‌మాల్ 3కి ఇది రీమేక్‌. హన్సిక‌, ప్ర‌ణీత‌, ర‌వీనాటండ‌న్ కథానాయిక‌లుగా న‌టిస్తున్నారు. వ‌రుణ్‌సందేశ్‌, త‌నీష్‌లు కూడా క‌నిపిస్తారు. మొత్త‌మ్మీద ఐదుగురు హీరోలు గ‌లాటా  చేస్తున్నార‌న్న‌మాట‌.

��
ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే క‌థ ఇది. సినిమా అంతా పండుగ వాతావ‌ర‌ణంలో సాగుతుంద‌ట‌. తొలి షెడ్యూల్ ఇటీవ‌లే ఐస్‌లాండ్‌లో పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే రెండో షెడ్యూలు మొద‌లుపెడ‌తారు.  ఈ సారి మంచు వారి వాకిట్లో ఒక మంచి విజయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: