తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలయ్య తన 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ అభిమానుల ముందుకు వచ్చారు.  ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది.  సంక్రాంతి కానుకగా  బాల‌య్య 100వ చిత్రం అభిమానుల‌నే కాదు విమ‌ర్శ‌కులను కూడా మెప్పించింది.  
Image result for goutamiputra satakarni posters
ఈ చిత్రంపై ఇండస్ట్రీకి చెందిన దర్శక, నిర్మాతలు, నటులు అందరూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.  అంతే కాదు ఇంత తక్కువ సమయంలో ఇలాంటి చారిత్ర‌క సినిమాని పూర్తి చేసినందుకు క్రిష్‌కి అంద‌రూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. అంతా బాగుందని అంటున్నా..మరోవైపు ఈ చిత్రంపై విమర్శలు వస్తున్నాయి.  దీనిపై  స్పందించిన బాలయ్య..ఈ తప్పు కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని పైగా పూర్తిస్థాయిలో ఆధారాలు లేనందున ఇలా చేయాల్సి వచ్చిందని ఆ తప్పు ఒప్పుకున్నాడు .  
Related image
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో పూర్తిస్థాయిలో కథ లేకపోవడం , అలాగే సినిమా మొత్తం యుద్ధ సన్నివేశాలతో నింపేయడం . మొదట్లో ఈ విమర్శ వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ స్పందించలేదు కానీ ఎట్టకేలకు బాలయ్య మాత్రం ఆ తప్పు ఒప్పుకున్నాడు . మొత్త‌మ్మీద‌, సినిమా విడుద‌ల‌యిన త‌ర్వాత బాల‌య్య క‌థ‌పై వ‌స్తున్న కామెంట్స్‌ని నిజాయితీగా అంగీక‌రించ‌డం విశేషం. సినిమాలో ఇంకొంచె క‌థ ఉంటే శాత‌క‌ర్ణి రేంజ్ మ‌రింత పెరిగేదంటున్నారు విశ్లేష‌కులు. ఓ వైపు విమర్శలు వస్తున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం శాతకర్ణి ప్రభంజనం సృష్టిస్తోంది .



మరింత సమాచారం తెలుసుకోండి: