బాలీవుడ్‌లో తెలుగు హాట్ బ్యూటీ చార్మీ మ‌రో ఐటెం సాంగ్ చేయటానికి సిద్దమైంది. తెలుగులో హీరోయిన్ ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో ఐటెం సాంగ్స్‌తో కొర‌త‌ను తీర్చుకుంటుంది. అందుకే క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌చ్చే మూవీలలో ఐటెం చేస్తావా అని చార్మీను అడిగితే ఇట్టే ఓకే చెబుతుంది. ఆ విధంగా బాలీవుడ్‌లో చార్మీ మ‌రో ఐటెం సాంగ్ చేయ‌టానికి సిద్దమైంది.

షాహిద్ క‌పూర్,సోనాక్షిసిన్హా జంట‌గా వ‌స్తున్న రాంబోరాజ్‌కుమార్ మూవీలో చార్మి ఐటెం సాంగ్ చేస్తుంది. ఇందులో ఐటెం సాంగ్ చేయటం హాపీగా ఉంద‌ని త‌న ఆనందాన్ని పంచుకుంది. బాలీవుడ్‌లో చార్మీకు ఇది మొద‌టి ఐటెం సాంగ్ కాదు. అంత‌కు ముందే బుడ్డా హోగా తేరా బాప్‌,జిల్లా గ‌జియాబాద్‌, ఇప్పుడు రాంబో రాజ్‌కుమార్ ఐటెం సాంగ్‌లు చేసుకుంటూ వ‌స్తూనే ఉంది.

షాహిద్ క‌పూర్ ఈ మూవీలో త‌న సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తున్నాడు. ఈ మూవీను ప్రభుదేవా డైరెక్ట్ చేస్తుండ‌టంతో చార్మీకు ఈ ఆఫ‌ర్ ద‌క్కింది. యాక్షన్ ఫిల్మ్‌గా ఇది తెర‌కెక్కుతుంది. సోనాక్షిసిన్హా ఓ లీడ్‌రోల్‌ను ప్లే చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: