బుజ్జిగాడు మేడిన్ చెన్నై మూవీలో ప్రభాస్ స‌ర‌స‌న న‌టించిన సెకండ్ లీడ్ రోల్ హీరోయిన్ సంజ‌న‌. త్రిష‌తో పాటు, సంజ‌న క్యారెక్టర్ కూడ అంద‌రినికి ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఆ మూవీ త‌రువాత సంజ‌న కెరీర్ బాగుంటుంద‌ని అనుకుంటే, ఆ త‌రువాత నుండి సంజ‌న, చెప్పుకోద‌గ్గ మూవీలను చేయ‌లేదు.

చేసిన మూవీల‌న్ని చిన్నమూవీలే. కాని గ్లామ‌ర్‌ను మాత్రం ప్రతి మూవీలో ఆర‌బోస్తుంది. బుజ్జిగాడుతో 2008లో తెల‌గు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి, త‌రువాత సంవ‌త్సరానికి క‌నీసం 5 నుండి 9 మూవీలలో న‌టిస్తూ వ‌స్తుంది. తెలుగు కంటే కన్నడ‌లోనే ఎక్కువ మూవీలు చేసిన‌ప్పటికి, బి గ్రేడ్ ఉన్న పాత్రలే సంజ‌న వ‌ద్దకు చేరుతున్నాయి.

ఏ మూవీ చేసినా అందులో అందాలు మాత్రం ఆర‌బోస్తేనే ఆప‌ర్లు అంటూ సంజ‌నాను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితో సంజనా ఎక్కువ కాలం ఇండ‌స్ట్రీలో కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపంచ‌డంలేదు. మంచి బ్రేక్ కోసం చూడాలంటే , అప్పటి వ‌ర‌కూ చేతికి వ‌చ్చిన మూవీలు చేయ‌క త‌ప్పదు అని చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: