రాజమౌళి అంటే ఇండియన్ సినిమాలో ఇప్పుడొక సెన్సేషనల్ డైరెక్టర్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రాంతీయ భాషా సినిమాని నేషనల్ సినిమా రేంజ్ లో చూపిన డైరెక్టర్ ఒక్క రాజమౌళినే అని చెప్పవచ్చు. తను తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా అయింది. ఇందుకు కారణం రాజమౌళి చేసిన వ్యూహరచన. బాహుబలి మూవీకి ఇంటర్నేషనల్ లుక్ ఇవ్వటంతో తను పడ్డ కష్టంచాలానే ఉంది.

ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పేరును ఒక్కసారిగా ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా కనిపించేలా చేయటం కూడ ఓసాహసమే. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ కారణంగా రాజమౌళికి కాస్త రేటింగ్ తగ్గిందనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. క్రిష్ తెరకెక్కించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇది ఎంతలా సక్సెస్ అయిందంటే క్రిష్‌ను అభినందిస్తూ రాజమౌళి స్వయంగా ఒక లెటర్ రాయడం వరకూ వెళ్ళింది.

ఇదో విశేషంగా చెప్పుకోవాలి. అంజనాపుత్ర క్రిష్ అంటూ మొదలుపెట్టి రాజమౌళి ఆ లేఖలో క్రిష్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిష్ ని రాజమౌళి పట్టించుకోకపోతే రాజమౌళిపై నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఎక్కువుగా కనిపిస్తుంది. ఇది సమ్మర్ లో విడుదుల అవుతున్న బాహుబలి సీక్వెల్ పై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే బాహుబలి2కి చేసిన ప్రమోషన్…సినీ ప్రేక్షకులకి అంత కిక్ ని ఇవ్వలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కారణంగా బాహుబలి2 పై ప్రేక్షకులకు కొంత మోజు తగ్గింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి. తిరిగి బాహుబలిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళాలంటే ఇప్పుడు క్రిష్ ని అప్రిషియేట్ చేయటం తప్పితే మరో మార్గం కనిపించటం లేదు.

ఈ విధంగా చేయటం ద్వార తను తెరకెక్కించిన బాహుబలి మూవీపై ప్రేక్షకులు పాజిటివ్ ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి…రాజమౌళి ఈ మాస్టర్ ప్లాన్ ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని చూసిన తరువాత ప్రేక్షకులు ఈ మూవీలో చూసిన ఫైట్స్ కంటే బాహుబలి మూవీలో ఎక్కువుగా ఉండాలి కోరుకుంటున్నారు. మరి రాజమౌళి ప్రేక్షకుల ఆంచనాలను అందుకుంటారో?లేదో? చూడాలంటే బాహుబలి సీక్వెల్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: