‘బాహుబలి 2’ షూటింగ్ పూర్తి అయిపోయిన నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ పై దాదాపు నాలుగు టీమ్స్ రెండు షిఫ్ట్స్  లలో పని చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  మన భాగ్యనగరానికి సంబంధించి మాత్రమే కాకుండా చెన్నై ముంబాయిలకు చెందిన అనేకమంది గ్రాఫిక్ ఎక్స్పర్ట్స్  నేతృత్వంలో ‘బాహుబలి 2’ గ్రాఫిక్ పనులు వేగవంతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ గ్రాఫిక్ వర్క్స్ యుద్ధ సన్నివేశాలకు సంభందించి ఎటువంటి సమస్యలు లేకుండా ఒక టైమ్ బౌండ్ ప్లాన్ లో నడిచిపోతు ఉంటె అనుష్కకు సంభందించిన సన్నివేశాల గ్రాఫిక్ పనులకు అనుకోని అంతరాయాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.  అనుష్క తన భారీ శరీరాన్ని ఇంకా పూర్తిగా తగ్గించుకోలేకపోయిన నేపధ్యంలో ఆ లుక్ తోనే అనుష్క గత సంవత్సరం ‘బాహుబలి 2’ షూటింగ్ లో పాల్గొనవలసి వచ్చింది.  

ముఖ్యంగా అనుష్క ప్రభాస్ ల మధ్య చిత్రీకరించిన ఒక రొమాంటిక్ సాంగ్ లో అనుష్కను రాజమౌళి ఎంత తెలివిగా తన తెలివి తేటలతో చిత్రీకరణ చేయించినా దాని రిజల్ట్ రాజమౌళికి ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు అని ఫిలింనగర్ టాక్. దీనితో ఈ రొమాంటిక్ సాంగ్ దీనితో ఈ రొమాంటిక్ సాంగ్ లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉపయోగిస్తూ వీలైనంత వరకు అనుష్కను నాజుకుగా అందమైన రాజకుమారిగా చూపించడానికి అనేక ప్రయత్నాలను రాజమౌళి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మంచి లోకేషన్స్ లో అద్భుతమైన కెమెరా పనితీరుతో తీసిన ఈ రొమాంటిక్ సాంగ్ ను వీలైనంత అందంగా చూపెట్టాలని రాజమౌళి తెగ తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు అనుష్క ప్రస్తుత రూపం సమస్యగా మారడంతో రాజమౌళి ఈ విషయంలో పూర్తిగా గ్రాఫిక్స్ ను నమ్ముకున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ ను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి ఈమూవీ విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని రాజమౌళి ప్లాన్ అన్న మాటలు వినిపిస్తున్నాయి.  అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి నెలాఖరులో రాబోతున్న ‘ఉగాది’ పండుగ రోజున ఈమూవీ ఆడియోను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: