భార‌త‌దేశంలోనే మొద‌ట్ట‌మొద‌టి కామిక్ త్రీడీ సినిమా అంటూ హ‌డావుడి చేసిన సినిమా యాక్ష‌న్. ఈ సినిమాతోనే నిర్మాత‌ అనిల్ సుంక‌ర ద‌ర్శ‌కుడిగా మారాడు. నిర్మాత‌గా సంపాదించిందంతా - ఈ సినిమాలో పెట్టాడు. న‌రేష్ మార్కెట్ గురించి ఆలోచించ‌కుండా బాగా ఖ‌ర్చుపెట్టాడు. దాదాపు ఈ సినిమాకి రూ.22 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని అంచ‌నా!
సుడిగాడు హిట్టు చూసి ఈ సినిమాని కొన‌డానికి బయ్య‌ర్లు వ‌చ్చినా - సుంక‌ర చెప్పిన రేట్ల‌కు హ‌డ‌లిపోయి వెన‌క్కి వెళ్లారు. దాంతో కొన్ని ఏరియాల్లో... సొంతంగా విడుద‌ల చేసుకొన్నారు. తీరా సినిమా చూస్తే.. తొలి రోజే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. అనిల్ సుంక‌రకి ద‌ర్శ‌క‌త్వంలో అనుభ‌వం లేక‌పోవ‌డంతో చాలా సాదా సీదాగా ఈ సినిమాని తీశాడు.

��
శాటిలైట్ హ‌క్కుల్ని విడుద‌ల‌కు ముందే అమ్మకొన్నారు కాబ‌ట్టి స‌రిపోయింది లేదంటే. భారీ మొత్తంలో లాస్ భ‌రించాల్సి వ‌చ్చేది. ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం ఈ సినిమాకి స‌గానికి స‌గం పోయింద‌ట‌. సినిమా కొన్న బ‌య్య‌ర్లు బాగా న‌ష్ట‌పోయార‌ట‌. దాన్ని రాబ‌ట్టుకోవాలంటే 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఓ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. వ‌న్‌, రూల‌ర్ సినిమాలకు అనిల్ సుంకర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: