క్రేజీ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియకపోయినా అతడు తీసుకుంటున్న పారితోషిక విషయాలు మాత్రం అత్యంత సంచలనంగా మారుతున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది దేవిశ్రీ ప్రసాద్.

హ్యారిస్ జయరాజ్, యువన్‌ శంకర్ రాజా వంటి సీనియర్ సంగీత దర్శకుల చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా తమిళ నాడులో కూడ కొనసాగుతోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ ఒక సినిమాకు మ్యూజిక్ అందించడానికి మూడు కోట్ల నుండి ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే హ్యారిస్ జయరాజ్ మూడు కోట్ల వరకు తీసుకుంటాడదాని అంటున్నారు. 

అయితే వీళ్ళీద్దరూ తెలుగు సినిమాల వైపు ఎక్కువ దృష్టి పెట్టరు. దీనితో చాలామంది టాప్ డైరెక్టర్స్ దృష్టి అంతా దేవిశ్రీ పైనే ఉంటోంది. దీనితో దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకోవాలంటే మన తెలుగు నిర్మాతలలు 2.5 కోట్ల రూపాయలువరకు పారితోషికంగా చెల్లించుకోవలసిన పరిస్థితులు ఎర్పడుతున్నాయి అని అంటున్నారు. 

దీనికితోడు గాయకులకు, గీత రచయితలకు, రికార్డింగ్‌కు వేరేగా డబ్బులు చెల్లిచవలసిన పరిస్థితి  ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దేవిశ్రీ చేత మ్యూజిక్ చేయించుకోవడానికి ఇంచుమించు మూడు కోట్లరూపాయలు ఖర్చుపెట్టాలి అన్న వార్తలు వస్తున్నాయి.  దీనికితోడు ఇటీవల కాలంలో దేవిశ్రీ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయంతెలిసిందే. లేటెస్ట్ గా విడుదల అయిన  ‘ఖైదీ నెం 150’ బ్లాకు బస్టర్ హిట్ అవడంలో దేవిశ్రీప్రసాద్ పాటలు కీలక పాత్ర పోషించిన నేపధ్యంలో దేవిశ్రీ తన పారితోషికాన్ని 3 కోట్ల వరకు పెంచే ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దికాలం క్రితం దేవిశ్రీప్రసాద్ హీరోగా మారుతాడు అని ప్రచారం జరిగినా హీరోల కంటే సంపాదనలో దేవిశ్రీ ముందు వరసలో ఉన్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: