గత ఏడు సంవత్సరాలుగా హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ కమలహాసన్ కుమార్తిగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఆమె దక్షిణాది సినిమా రంగంలో ఏర్పరుచుకుంది. ఏ విషయం పై అయినా ఎటువంటి మొహమాటాలు లేకుండా శృతి ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత పురుషాధిక్య ప్రపంచం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

స్త్రీల ప్రాముఖ్యత గురించి ఉన్నతి గురించి మాట్లాడే చాలామంది మగవాళ్ళు ఫిమేల్ సక్సస్ ను మనస్పూర్తిగా అంగీకరించలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతేకాదు ప్రస్తుతం స్త్రీలు బతుకుతున్నది మేల్ డామినేటెడ్ ప్రపంచంలోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు మన ఇండియాలోనే కాదు అమెరికాలో కూడ ఆడవాళ్ళు అంటే చిన్న చూపే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రుతిహాసన్. 

ఇదే సందర్భంలో సినిమా రంగంలో పెరిగి పోతున్న పోటీ గురించి మాట్లాడుతూ ఈరోజు స్టార్ అయినంత మాత్రాన మరో రెండేళ్ళ తరువాత ఇదే స్టార్ స్టేటస్ లో ఉంటామని గ్యారెంటీ లేదని అందువల్లనే అందరికీ ఎవరి స్థాయిలో వారికి వర్క్ ప్రషర్ పెరిగి పోతోంది అంటూ కామెంట్స్ చేసింది. అదేవిధంగా తన టాలెంట్ గురించి మాట్లాడుతూ తనకన్నా టాలెంట్ ఉన్న ఎంతోమందికి ఈరోజు సినిమాలలో అవకాశాలు రావడం లేదని ఒక విధంగా తాను కమలహాసన్ కూతురుగా పుట్టడం తన అదృష్టం అంటూ కమల్ ను ఆకాశానికి ఎత్తేసింది శృతిహాసన్. 

ఇక తన తండ్రి కమల్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ తాను పెళ్ళి చేసుకుంటే చూడాలని తన తండ్రి ముచ్చట పడుతున్న విషయం తనకు తెలుసు అనీ అయితే తన భావాలను అర్ధం చేసుకునే వ్యక్తి దొరకాలి కదా అంటూ కామెంట్స్ చేసింది.  తన అత్తమామలు వద్దన్నారానో లేదా తన భర్త అంగీకరించలేదనో అన్న కారణంతో తాను నటనకు గుడ్ బై చెప్పనని తనకు ముసలి వయసు వచ్చే వరకు అవకాశాలు వస్తే నటిస్తూనే ఉంటాను అంటూ శృతి తనలోని అనేక భావాలను షేర్ చేయడమే కాకుండా తన పై తన తండ్రి ప్రభావం విపరీతంగా ఉంది అని కామెంట్స్ చేసింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: