తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ‘రాజకుమారుడు’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  తర్వాత మురారి చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన మహేష్ మొదట్లో లవర్ బాయ్ గా కనిపించానా..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రంతో ఫుల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత వరుస హిట్స్ తో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లారు మహేష్. ఇక మిర్చి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన మహేష్ ఆ తర్వాత బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాలో నటించారు.  ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మహేస్ ప్రస్తుతం మురుగదాస్ దర్శత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  
Image result for mahesh babu murugadoss
మహేష్ బాబు - మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ కానీ ఆ సినిమా మాత్రం అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగకపోవడంతో ఇప్పటికే పలు రిలీజ్ లు వాయిదా పడ్డాయి కానీ ఇంకా షూటింగ్ పార్ట్ మాత్రం పూర్తికాలేదు. ఇప్పటికే తెలుగు టాప్ హిరోల సినిమాలు వరుసగా వస్తున్నాయి..కలెక్షన్లు కూడా బాగా కలెక్ట్ చేస్తున్న నేపథ్యంతో మహేష్ చిత్రం మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
Image result for vivegam ajit
జనవరి తర్వాత లేదా మార్చి లో సినిమా రిలీజ్ ఉండొచ్చు అని అన్నారు మొదట్లో అక్కడి నుండి ఏప్రిల్ కు వెళ్ళింది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ కాదు మే కాదు జూన్ లో ఉండొచ్చట అది కూడా కన్ఫర్మ్ కాదు . ఎందుకంటే జూన్ లో మహేష్ సినిమా రిలీజ్ చేద్దామనుకుంటున్న సమయంలో తమిళంలో అజిత్ సినిమా రిలీజ్ అవుతోందంట అందుకే అప్పుడు కూడా రిలీజ్ కష్టమే కావొచ్చు అని వినబడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: