Star castRavi TejaShruti HaasanAnjali
ProducerPrasad Vara PotluriDirectorGopichand Malineni.

బలుపు రివ్యూ: చిత్రకథ

బెంగుళూరు ఐసిసిసిఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్న రవి (రవితేజ )తో కథ మొదలవుతుంది . తండ్రి మోహన్ రావు (ప్రకాశ్ రాజ్ ) తో కలిసి బెంగుళూరులో ఉంటున్న రవికి పెళ్లి చెయ్యాలని మోహన్ రావు ప్రయత్నిస్తుంటాడు అలాంటి సమయంలో అనుకోకుండా రవి జీవితంలోకి శృతి (శ్రుతి హాసన్ ) క్రేజీ మోహన్ (బ్రహ్మానందం )తో కలిసి ప్రవేశిస్తుంది . స్నేహితుడిని మోసం చేసిన శ్రుతికి ఎలాగయినా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న రవి శృతిని ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ ఉంటాడు . ఒకానొక సమయంలో అప్పటికే పెళ్లి నిశ్చయమయిన శృతి రవితో ప్రేమలో పడుతుంది .

ఈ విషయం తెలిసిన శృతి తల్లిదండ్రులు రోహిత్ (అడవి శేష్ )తో పెళ్లి రద్దు చేసి శృతి ప్రేమించిన రవితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటారు 
అప్పటికే రవితేజ తో వ్యక్తిగత శత్రుత్వం ఉన్న రోహిత్ ఈ పెళ్లిని ఎలాగయినా ఆపాలని తన మామయ్యా వైజాగ్ పూర్ణ (అసుతొశ్ రానా ) సహాయం కోరతాడు. నిశ్చితార్ధం ఆపడానికి వచ్చిన పూర్ణ కి అప్పటివరకు తను వెతుకుతున్న శంకర్, నానాజీ లే ఈ రవి, మోహన్ రావులని అర్ధం అయిన పూర్ణ శ్రుతిని తీసుకు వెళ్లిపోతు వైజాగ్ వచ్చి తీసుకెళ్ళమని శంకర్ అలియాస్ రవి తో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. అసలు వీరి ముగ్గురి శత్రుత్వం ఏంటి? డాక్టర్ అంజలి (అంజలి ) ఎవరు ? రవితేజ శ్రుతి హసన్ ని కాపాడడా? అంజలి ఏమయింది ? శంకర్ రవి లా ఎందుకు మారాడు ? అన్న ప్రశ్నలకు తెర మీదనే సమాధానం దొరుకుతుంది ......

Balupu - English Full Review


బలుపు రివ్యూ: నటీనటుల ప్రతిభ

మాస్ మహారాజ అని పేరు తెచుకున్న రవి తేజ ఈ మధ్య కాలం లో మాస్ ఆకట్టుకోవటంలో విఫలం అవుతున్నారన్న విమర్శ ఈ చిత్రంతో తొలగిపొనుంది ముఖ్యంగా రెండవ అర్ధ భాగంలో అయన నటించిన తీరు ఆయన గెటప్ , బాడీ లాంగ్వేజ్ , మాస్ డైలాగ్ డెలివరీ ఒక్కసారి రవితేజ లో ని మాస్ యాంగిల్ ని బయటకి రప్పించాయి . ఇక కథానాయిక విషయానికి వస్తే హీరో మాస్ హీరోయిన్ క్లాసు అన్నట్టు మోడరన్ గర్ల్ లుక్ లో శ్రుతి హాసన్ అందాల ఆరబోత ప్రేక్షకులకు కనువిందు కలిగించిందనే చెప్పచ్చు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చెయ్యడం శ్రుతి హాసన్ కి ఇదే మొదటిసారి.

క్రేజీ మోహన్ పాత్రలో బ్రహ్మానందం ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు ముఖ్యంగా అయన వేసిన గంగ్నం డాన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటి అని చెప్పచ్చు. చివర్లో అయన చెప్పిన పంచ్ డైలాగ్స్ సగటు ప్రేక్షకుడిని సీట్లలో కూర్చోనివ్వద్దు అంత ఫన్నిగా ఉంటాయి. అంజలికి ఎప్పటిలానే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికింది అంజలి కూడా ఎప్పటిలానే పాత్రకు న్యాయం చేసింది. రెండు విభిన్నమయిన పాత్రలలో ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. అశుతోష్ రానా , అడవి శేష్ పాత్రల పరిధి మేరకు పరవాలేదనిపించారు.

 

బలుపు రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

ముందే చెప్పినట్టు రొటీన్ స్టొరీ ని డిఫరెంట్ స్క్రీన్ప్లే తో చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం కొంతవరకు ఫలించింది అనే చెప్పాలి. రెండవ అర్ధభాగం కూడా కాస్త పగడ్భంధీ స్క్రీన్ప్లే రాసుకొని ఉంటె ఇంకా బాగుండేది దర్శకుడిగా గోపీచంద్ పాస్ మార్కులు తో బయటపడ్డాడు. జయనన్ విన్సెంట్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కోన వెంకట్ - వెలిగొండ అందించిన సంభాషణలలో ప్రాస విషయం పక్కన పెడితే మాస్ ని ఆకట్టుకునేల ఉన్నాయి.  

ఎడిటింగ్ విభాగంలో గౌతం రాజు రెండవ అర్ధ భాగం మీద ప్రేమ తగ్గించుకొని మరింత కత్తిరించి ఉండాల్సింది. నలుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ సింహ భాగం గాల్లోనే జరిగినా మాస్ ని ఆకట్టుకునేల చిత్రీకరించారు. తమన్ సంగీతం పరవాలేదనిపించింది నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి.

బలుపు రివ్యూ: హైలెట్స్

  • బ్రహ్మానందం కామెడీ,
  • రవితేజ మాస్ లుక్ మరియు మాస్ యాక్షన్ విత్ పంచ్ డైలాగ్స్,
  • కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్,
  • శృతి హాసన్ గ్లామర్. 

బలుపు రివ్యూ: డ్రా బాక్స్

  • పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ కథ ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో వచ్చింది. మనోళ్ళు అదే పాత రొటీన్ కథను కొత్తగా చెప్పాలన్న ప్రయత్నమే 'బలుపు.
  • మొదటి అర్ధ భాగాన్ని కామెడితో గడిపేసినా కథా ప్రాధాన్యం ఉన్నా రెండవ అర్ధ బాగాన్ని ఎలా చెప్పాలో తెలియక దర్శకుడు తడబడ్డాడు దీంతో చిత్రం బాగా నెమ్మదిస్తుంది.
  • చివర్లో ఎమోషన్ సన్నివేశాల స్థానంలో బ్రహ్మానందం కామెడీ ఆకట్టుకుంది. కానీ ఆ సన్నివేశాలు ఎంత ఎమోషన్ లెస్ గా ఉన్నాయో అర్ధం అయిపోతుంది.
  • రెండు మూడు పాటలు కూడా సందర్భానుసారంగా లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయాయి.
  • డైలాగ్స్ బాగున్నప్పటికీ ప్రాస కోసం ఎక్కువగా పాకులాడటం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
  • అలీ కామెడీ పరమ రొటీన్ గా అనిపిస్తుంది.

బలుపు రివ్యూ: విశ్లేషణ

ఈ మధ్య కాలంలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రవితేజ ఈ చిత్రంతో తన ఉనికిని తిరిగి చాటుకున్నారు. ఇప్పటి వరకు సైలెంట్ పాత్రలో కనిపించిన శృతి ఈ చిత్రం తో గ్లామర్ ప్రదర్శన తనకీ వచ్చని చాటి చెప్పింది. డాన్ శీను సినిమా తరువాత రవితేజ తో మళ్ళీ చిత్రాన్ని తీసిన గోపీచంద్ తన పాత సూత్రం "పాత కథ - కొత్త స్క్రీన్ ప్లే" నే మళ్ళీ ఉపయోగించాడు. ప్రకాష్ రాజ్, అంజలి లు తమకి ఇలాంటి పాత్రలే వస్తాయి మేము ఇలానే నటిస్తము అని చెప్పకనే చెప్పారు. నిర్మాతలు నిర్మాణ విలువలను పడిపోకుండా చూసుకున్నారు. తమన్ మ్యూజిక్ "ఎప్పటిలాననే" బాగుండేలా చూసుకున్నాడు.

బలుపు రివ్యూ: చివరగా

రవితేజలో మాస్ యాంగిల్ మిస్ అవుతున్న అభిమానులు తప్పక చూడవలసిన చిత్రం.

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Balupu | Balupu Wallpapers | Balupu Videos

మరింత సమాచారం తెలుసుకోండి: