హార్వార్డ్‌ యూనివర్సిటీలో ప్రసంగించడానికి అమెరికాకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ఈసారి తన ‘జనసేన’ రాజకీయాలకు సంబంధించి కూడ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అంటూ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్ సన్నిహితుల నుండి సంకేతాలు అందుతున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తల హడావిడి చేస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడమే కాకుండా అక్కడి భారతీయ సంతతికి చెందినా విధ్యార్ధులతో కొంత సేపు వివరంగా మాట్లాదబోతున్నాడని తెలుస్తోంది.  ఇది ఇలా ఉండగా అమెరికా పర్యటనలో ఉన్న పవన్ స్టీవెన్‌ జార్డింగ్‌ అనే వ్యక్తితో రెండు గంటలపాటు సమావేశం నిర్వహించడమే కాకుండా అనేక రాజకీయ సామాజిక విషయాలు తన ‘జనసేన’ సిద్ధాంతాలను గురించి కూడ వివరంగా చర్చించినట్లు టాక్. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ స్టీవెన్‌ జార్డింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కి అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్ని ఫేస్‌ చేస్తోన్న అఖిలేష్‌ యాదవ్‌కి రాజకీయ సలహాదారుడుగా స్టీవెన్‌ జార్డింగ్‌ వ్యవహరిస్తున్నాడని తెలుస్తున్న సమాచారం. 

ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కలుసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  దీనినిబట్టి చూస్తూ ఉంటే ‘జనసేన’ పార్టీకి సంబంధించి కొన్ని సలహాలను కూడ స్టీవెన్ జార్డింగ్ పవన్ కు ఇచ్చి ఉంటాడు అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పవన్ హ్యాంప్‌ షైర్‌ గవర్నర్‌ తో భేటీ కాబోతూ ఉండటం అక్కడి అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు లత మంగపూడి తదితర ప్రముఖులతో పవన్ ఏకాంతంగా సమావేశం కావడం చూస్తూ ఉంటే పవన్ ఒక పెద్ద ఎజెండాతోనే అమెరికాకు వెళ్ళినట్లు అనిపిస్తోంది.  దీనినిబట్టి చూస్తూ ఉంటే పవన్ తన ‘జమసేన’ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత తన రాజాకీయ ఎత్తుగడల స్పీడ్ ను మరింత పెంచే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: