వ‌రుస ఫ్లాప్‌ల‌తో త‌న ఇమేజ్‌కి డామేజీ తెచ్చుకొన్నాడు ర‌వితేజ‌. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్‌లైన్ కూడా ఏనాడో చెరిగిపోయింది. ర‌వితేజ సినిమా అంటే మ‌హాఅయితే మూడురోజులే అనే నిర్ణ‌యానికి వ‌చ్చేశారంతా. సినిమా బ‌య‌ట‌కు రాక‌ముందే నెగిటీవ్ టాక్ వ్యాపించ‌డం మామూలైపోయింది. అయితే చాలా కాలం త‌ర‌వాత ర‌వితేజ సినిమాకి పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది.

ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తున్నరెండో సినిమా బ‌లుపు. శ్రుతిహాస‌న్, అంజ‌లి క‌థానాయిక‌లు. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ ముందుకు వెళ్లింది. U/A స‌ర్టిఫికెట్ అందుకొంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ మాత్రం చాలా పాజిటీవ్ గా ఉంది. ర‌వితేజ‌కు బీ.సీ సెంట‌ర్ల‌లో ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బాగా ఎక్కుతుంద‌ని చెబుతున్నారు. బ్ర‌హ్మానందం కామెడీ ఈ సినిమాని గ‌ట్టెక్కించేస్తుంద‌ని జోస్యం చెబుతున్నారు.

��
క‌థ రొటీన్‌గా సాగినా - కామెడీ ఈ సినిమాకి ప్రాణం అని తెలుస్తోంది. ర‌వితేజ‌ని ఇరికించాల‌ని బ్రహ్మానందం, శ్రుతిహాస‌న్ తెగ ట్రై చేస్తార‌ట‌. ఆ స‌న్నివేశాల‌న్నీ క‌డుపుబ్బా న‌వ్విస్తాయ‌ని చెబుతున్నారు. పాట‌లు ఓ మోస్త‌రుగా ఉన్నాయ‌ట‌. ల‌క్ష్మీరాయ్ ఐటెమ్ సాంగ్ మాత్రం కేక పుట్టిస్తుంద‌ట‌. మొత్త‌మ్మీద సూప‌ర్ హిట్ సినిమా కాక‌పోయినా, కాల‌క్షేపానికి ఢోకాలేద‌నే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: