తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా విజయాలు చూడని పవన్ ‘ఖుషి’ చిత్రం తర్వాత ఒక్కో విజయాన్ని అందుకోవడం మొదలు పెట్టాడు.  ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం తో మంచి ఫ్యామిలీ హీరోగా నిరూపించారు.  గత సంవత్సరం రిలీజ్ అయిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం కాస్త నిరాశ పరిచినా పవన్ కళ్యాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు.  
Image result for katama rayudu stills
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం టీజర్ ఇటీవల విడుదలై కేవలం రెండు గంటల్లో మిలియన్ వ్యూస్ సాధించి యుట్యూబ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తున్న నమ్మకం అందరికి కలిగింది.  అంతే కాదు ఈ ఎఫెక్ట్ సినిమా బిజినెస్ పై కూడా పడింది.  ఈ చిత్రం నైజాం థియేట్రికల్ రైట్స్ కోసం 20కోట్లు ఆఫర్ చేసి హీరో నితిన్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
Image result for katama rayudu stills
ఉత్తరాంధ్ర హక్కుల నిమిత్తం 8.3కోట్లు, సీడెడ్ నిమిత్తం 12కోట్లు, ఈస్ట్ హక్కుల కోసం 5.5.కోట్లు, వెస్ట్ కు గానూ 4.85కోట్లు, గుంటూరు 6.5కోట్లు, ఓవర్ సీస్ హక్కులకుగానూ దాదాపు 12 కోట్లు  దక్కినట్టు తెలుస్తోంది.  ఇంత  పెద్ద  సొమ్ము పలకడం తో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించబడింది. ఈ చిత్రాన్ని మార్చి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: