పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. త్వరలోనే ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ డేట్ ని సైతం చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన`స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` మూవీకి నష్టాలు వచ్చాయంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దీని కారణంగా ‘కాటమరాయుడు’ మూవీపై ఇది ప్రభావితం చూపిస్తుందని అంటున్నారు.

Image result for katama rayudu

దీంతో కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్...‘కాటమరాయుడు’ మూవీ ఏరియా రైట్స్ ని భారీ రేటుకి కొంటాం. ఒకవేళ సినిమా టాక్ రివర్స్ అయితే మాత్రం నష్టం జరిగిన ఎమౌంట్ ని రిఫండబుల్ చేయాలని కోరుతున్నారు. దాదాపు అన్ని ఏరియాల నుండి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఇదే ప్రశ్ననని పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విసుగు చెందిన పవన్ కళ్యాణ్ అందరికీ ఓ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన ఏ రైట్స్ ని తీసుకున్నా….ఎవ్వరికీ రిఫండబుల్ అనేది లేదు. నచ్చితేనే కొనండి లేదంటే మానుకోండి అంటూ హుకం జారిచేశాడని అంటున్నారు.

Image result for katama rayudu

ఈ తతరంగాన్ని నిర్మాత శరత్ మరార్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడని అంటున్నారు. ‘కాటమరాయుడు’ మూవీపై బ‌య్య‌ర్ల‌లో జరుగుతున్న విష‌ప్ర‌చారంకి బ్రేక్ చెప్పటం కోసమే పవన్ కళ్యాణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. అయితే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రం వ‌ల్ల న‌ష్ట‌పోయిన పాత పంపిణీదారులకు ‘కాటమరాయుడు’ సినిమా హ‌క్కులు ఇవ్వ‌డం జరగదని…దీనిపై ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండదని ఇప్పటికే నిర్మాత శరత్ మరార్ తేల్చి చెప్పటంతో ‘కాటమరాయుడు’మూవీకి సంబంధించిన బిజినెస్ విషయంలో కొంత గంధరగోళం ఏర్పడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: