ఎప్పుడు లేనివిధంగా కోలీవుడ్ హీరోలు హీరోయిన్స్ గాయని సుచిత్ర కార్తీక్ బయట పెట్టబోతున్న వీడియోల గురించి తెగ భయ పడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు దక్షిణాది సినిమా రంగాన్ని భావాన విషయం ఒక షేక్ చేసి వదిలేస్తే నిన్న రాత్రి సుచిత్రా కార్తీక్ చేసిన ట్విట్ కోలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 

దీనితో ఎవరిపేరు ఎప్పుడు బయటకు వస్తుందో అని కోలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు అంతా హడిలిపోతున్నారు. ఇప్పటికే కొన్ని ఫోటోలను వీడియోలను బయట పెట్టిన సుచిత్ర మరి కొన్నింటిని ఆదివారం సోమవారం మంగళవారం ఇలా టెలివిజన్ సీరియల్ లా బయటపెడతాను అంటూ ఆ షెడ్యూల్ కూడ ప్రకటించి కోలీవుడ్ ను షేక్ చేస్తోంది సుచిత్ర. 

రేపు ఆదివారం సమంత డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి – సంగీత దర్శకుడు అనిరుద్ లకు సంబంధించిన వీడియో సోమవారంనాడు ధనుష్ – అమలాపాల్ లకు సంబంధించిన వీడియో మంగళ వారం ధనుష్ – పార్వతినైర్ కు సంబంధించిన రహస్య వీడియోలను బయట పెడుతున్నట్లుగా సుచిత్ర ట్విట్ చేసి మరీ ప్రకటించడంతో కోలీవుడ్ మీడియా షేక్ అయిపోతోంది. దీనితో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో అంటూ కోలీవుడ్ మీడియా అనేక ఊహాగానాలు వ్రాస్తోంది. 

ఇది చాలదు అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ఒక హీరోయిన్ కు సంబంధించిన టాప్ లెస్ ఫోటోలను మరొక హీరోయిన్ కు సంబంధించిన న్యూడ్ వీడియో కూడ కోలీవుడ్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలు అని సరిపెడుతూ ఉన్నా ఒకేసారి ఇంతమంది హీరోలు హీరోయిన్స్ పై ఎందుకు దాడి జరుగుతోందో అర్ధంకాని విషయంగా మారింది. దీనితో సుచిత్ర ఆఖరి నిముషంలో ఈ వీడియోలను బయట పెట్టకుండా తప్పించుకున్నా సుచిత్ర ప్రకటించిన వ్యక్తుల మధ్య ఏదో ఒక వ్యవహారాలు నడిచాయి అన్నది సుచిత్ర ట్విట్ ద్వారా మరొకసారి అందరికీ తెలియచేసినట్లు అయింది.

అయితే సుచిత్ర ట్విటర్ ను ఎవరో కావాలని హ్యాక్ చేసి ఈ వ్యవహారం అంతా నడిపించారు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఏమైనా ప్రస్తుతానికి సుచిత్ర మీడియాకు హాట్ న్యూస్.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: