కోలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ల కు ముచ్చెమటలు పట్టిస్తున్న పాప్ సింగర్ సుచిత్ర కార్తీక్ మరో బాంబ్ పేల్చింది. సుచీలీక్స్ పేరుతో బహిర్గతమవుతున్న సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ సుచిత్ర ఆరోపించింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది.
suchitra
ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది.  'హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనునిధ్‌లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను' అని హెచ్చరించింది. గతంలో ధనుష్, అనిరుధ్‌లు తనపై దాడి చేశారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను చేస్తున్న ఈ వ్యవహారం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ధనుష్, అనిరుధ్ బెదిరిస్తున్నారని, తనపై కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని.. అయితే.. తనపై ఏమని కంప్లైంట్ ఇస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. వాళ్లలో ఎవరికైనా దమ్ముంటే.. ఆ వీడియోల్లో ఉన్నది నిజమా? కాదా? చెప్పాలని సవాల్ విసిరింది.

ఇక సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు కూడా ఉండటం చాలామందిని షాక్ కి గురిచేసింది.చిన్మయి కి సంబధించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. ”డ్యూడ్.. పెళ్లికు ముందు నాలుగు అబార్షన్ లు చేసుకున్నావ్. డాక్టర్ రిపోర్ట్లు సహా నా దగ్గర ఆధారాలు వున్నాయి బయటపెట్టమంటావా? అంటూ ట్విట్టర్ లో హెచ్చరించింది సుచిత్ర. దీనిపై స్పందించిన తన భర్త రాహుల్, తానూ సుచిత్ర భర్త కార్తీక్‌తో మాట్లాడామని చిన్మయి చెప్పింది. మరోవైపు.. తన భార్యకు పిచ్చిపట్టిందని, ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సుచిత్ర భర్త కార్తీక్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుచీ లీక్స్ పేరుతో ఎవరు లీక్స్ చేస్తున్నారన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇరు సినీ పరిశ్రమల్లో ట్వీట్ల కలకలం



మరింత సమాచారం తెలుసుకోండి: