తెలుగు ఇండస్ట్రీలో సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ ఇప్పటి వరకు ఎలాంటి వివాదల్లో తలదూర్చలేదు.  సినిమా ఇండస్ట్రీ అయినా..రాజకీయాల్లో అయినా జయసుధ ఇప్పటి వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  ప్రస్తుతం జయసుధ తల్లి పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.   హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే  జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు తమ్ముడు అయిన నితిన్ కపూర్ను పెళ్ళి చేసుకున్నారు. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన జయసుధ 2001లో బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు.   2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచారు. నిన్న జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి చెందారు.
ఆత్మహత్య చేసుకొన్నట్టు సమాచారం.
 కొద్దిరోజులుగా ముంబైలోని అంధేరి ప్రాంతంలోని తన సోదరి నివాసంలో ఉంటున్న ఆయన.. మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్‌ ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. 58ఏళ్ల నితిన్ ద్వారకాదాస్ కపూర్ 18ఏళ్లుగా నిరుద్యోగిగా ఉన్నారని, ఏడాదిన్నర డిప్రెషన్ లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.  డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్‌ ఏడాదిన్నరగా సైకియాట్రిస్ట్‌ వద్ద చికిత్స పొందుతున్నారు. డిప్రెషన్‌ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.
తీవ్రమైన నిర్ణయం వెనుక కారణం..
 నిన్న ఒంటిగంటా 45నిమిషాల ప్రాంతంలో నితిన్ కపూర్, ఆరు అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి టెర్రస్ తాళం పగుల గొట్టి బిల్డింగ్ పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తమ రిపోర్ట్ లో పేర్కొన్నారు.  మూడేళ్లుగా జయసుధ కుటుంబం గండిపేట మండలం నెక్నాంపూర్‌ పంచాయతీ పరిధిలోని ఫైర్‌ఫీల్డ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలో నివసిస్తోంది. జయసుధ–నితిన్‌ దంపతులకు నిహార్, శ్రేయాన్‌ ఇద్దరు కుమారులు.

 ప్రముఖ హిందీ హీరో జితేంద్రకు ఈయన వరుసకు సోదరుడు.  నితిన్‌ కపూర్‌ను దర్శకుణ్ణి చేయాలనేది జితేంద్ర కోరిక.   జితేంద్ర  పలు తెలుగు సినిమాలను హిందీలో రీమేక్‌ చేశారు. అప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద తమ్ముడు నితిన్‌ని సహాయ దర్శకుడిగా చేర్చారు.  అప్పట్లో దాసరి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా జయసుధ హీరోయిన్‌గా నటించారు.

సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నితిన్‌కపూర్‌తో జయసుధకు ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఈ జంట కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఏది ఏమైనా అన్యోనంగా ఉంటున్న జయసుధ కుటుంబంలో విషాదం నెలకొంది..అయితే ఆత్మహత్యకు ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: