సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు..పోతున్నారు.  అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీ ఉన్నంత గుర్తుండి పోయేంతగా పేరు తెచ్చుకున్నారు.  ఇక తెలుగులో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోయిన కొంత వారి అసలు పేరు ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారు.  సినిమా వాళ్ల పేర్లకు పబ్లిక్ లో పబ్లిసిటీయే వేరు.
Related image
కొంత మంది ఇండస్ట్రీలో మంచి పేరు పొందాలంటే జాతక రిత్యా పేరు మార్చుకోవాలని కూడా మార్చుకున్నారు. కారణం ఏదైనా మన టాలీవుడ్ లో స్టార్ డం సంపాదించిన హీరోయిన్లలో అనేక మందికి అసలు పేర్లు వేరే ఉన్నాయి.   ఆ పేర్లతోనే పాపులర్ అయ్యారు.  ఇండస్ట్రీకి వచ్చి తమ సొంత పేర్లు మార్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. 
 Image result for bhumika
* జయసుధ: ఇండస్ట్రీలో సహజనటి జయసుధ అసలు పేరు సుజాత. ఆమె పుట్టిందీ..పెరిగింది మద్రాస్ లోనే. అయితే  జయసుధ సినిమాల్లోకి అడుగుపెట్టే సమయానికి మరో సుజాత ఉండటంతో పేరు మార్చోవాల్సి వచ్చింది.


* శ్రీదేవి: సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ.. అతిలోక సుందరి అసలు పేరు  శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ . పుట్టింది తమిళనాట అయినా
ముంబాయికి చెందిని స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. 

* జయప్రద : అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రధ  అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో స్థిరపడిపోయింది.

* రోజా:  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫైర్ బ్రాండ్ ఎవరయ్యా అంటే వెంటనే చెబుతారు..ఎమ్మెల్యే రోజా అని.  హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రోజా అసలు పేరు   శ్రీలత రెడ్డి. సినిమాల కోసం రోజాగా మారింది.
 
* సౌందర్య : పుట్టింది కర్ణాటకలో అయినా అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే సౌందర్య..మంచి భవిష్యత్ ఉందనుకున్న సమయంలో మృత్యువు ఆమెను కబలించింది.  తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య అనే పేరుకి చావు లేదు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈ మహానటి అసలు పేరు సౌమ్య.  
 
* రాశి: సినిమా ఇండస్ట్రీలో బాల నటిగా పరిచయం అయిన రాశి తర్వాత   గ్లామర్ రోల్స్ తో, అటు వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశి అసలు పేరు మంత్ర. ఇప్పుడు కూడా ఆమెని ఈ పేరుతో పిలుస్తారు.

* రంభ: నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మగా ఉంటుంది.. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ.  
 
* భూమిక :   ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త భూమికగా మార్చుకుంది.  ఈ అమ్మడు వచ్చిన కొత్తలో స్టార్ హీరోల సరసన నటించింది.  పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.
 
* అనుష్క: ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిని హాట్ బ్యూటీ   అనుష్క.  బెంగుళూరు కి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్.
 
* నయనతార : రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన  కేరళా బ్యూటీ నయనతార అసలు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ గ్లామర్ ప్రపంచంలోకి రాగానే నయనతారగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: