పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయినా సంగతి తెలిసిందే..డాలీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల పై కూడా విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. వారం రోజుల నుంచి ఈ సినిమాపై రక రకాల రూమర్లు వస్తున్నప్పటికీ కలెక్షన్లు బాగున్నాయంటున్నారు చిత్ర యూనిట్.  ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపిన కాటమరాయుడు మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ రికార్డు స్థాయి థియేటర్స్ లలో రిలీజ్ అయ్యింది.

A still from Katamarayudu

నిన్న రిలీజ్ అయిన గురు చిత్రం మినహా అన్ని చిత్రాలు బిలో యావరేజ్ కావడంతో కాటమరాయుడికి కలెక్షన్లకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కావడం,ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో కాటమరాయుడు చిత్రానికి కలెక్షన్స్ పెంచే అంశాలుగా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల షేర్ ని సాధించింది .

Image result for katamarayudu movie first day collection

కిషోర్ పార్దాసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు . పవన్ సరసన శృతి హాసన్ నటించిన కాటమ రాయుడు చిత్రం మార్చి 24న రిలీజ్ అయ్యింది. ఏది ఏమైనా గత సంవత్సరం వచ్చిన  సర్దార్ గబ్బర్ సింగ్ లా డిజాస్టర్ మాత్రం కాలేదు . ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల షేర్ ఏరియాల వారీగా ఇలా ఉంది.

నైజాం                   -    13. 1 కోట్లు

సీడెడ్                   -     7. 16 కోట్లు

ఉత్తరాంధ్ర                -     5. 68కోట్లు

ఈస్ట్                     -     4. 96 కోట్లు

వెస్ట్                      -     3. 93కోట్లు

కృష్ణా                     -     3. 29 కోట్లు

గుంటూరు                -      4. 52కోట్లు

నెల్లూరు                  -      1. 9 కోట్లు

కర్ణాటక                   -      5. 2కోట్లు

యూఎస్ ఏ               -      3. 70 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా        -      2. 60 కోట్లు

రెస్ట్ ఆఫ్ వెరల్డ్ మొత్తం : 55. 86 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: