రాజమౌళి ‘బాహుబలి 2’ విషయంలో అనుసరిస్తున్న మార్కెటింగ్ ట్రిక్స్ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ‘బాహుబలి 2’ ఈనెల 28న విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే సంచలనాలు సృష్టించిన ‘బాహుబలి’ పార్ట్ వన్ ను ఈరోజు ఇండియాలో తెలుగు తమిళ హిందీ భాషలకు చెందినా దాదాపు 1000 ధియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. 

అయితే ఈ రీ రిలీజ్ ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోని ధియేటర్లలోనే కనిపించ బోతోంది. మన తెలుగులో ఈమూవీ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నా అది పరిమితమైన ధియేటర్లలోనే జరుగుతోంది. ఉత్తరాదిన రీ రిలీజ్ అవుతున్న ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడమే కాకుండా చాల చోట్ల అప్పుడే ఈ సినిమాకు టిక్కెట్లు అయిపోవడం ‘బాహుబలి’ క్రేజ్ ను సూచిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రీ రిలీజ్ ద్వారా రాజమౌళి మరో 100 కోట్ల కలక్షన్స్ కు మెగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ సెకెండ్‌ రిలీజ్‌, థర్డ్‌ రిలీజ్‌ అని చేస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం ఒక టాప్ హీరో సినిమా 100 రోజులు ఆడటం అద్భుతంగా మారిపోయిన పరిస్థుతులలో  'బాహుబలి ది బిగినింగ్‌' రీ రిలీజ్‌ అంటే గొప్ప విషయమే అనుకోవాలి.

దీనితో ‘బాహుబలి 2’ విడుదల కాకుండానే 'బాహుబలి ది బిగినింగ్‌' వసూళ్ళ జాతరకు నేటి నుంచి తెర లేపుతోంది. ఈ వార్తలను చూసి బాలీవుడ్ మీడియా రాజమౌళిని పొగుడ్తూ సాహోరే బాహుబలీ నీ మార్కెటింగ్ స్ట్రాటజీలు భలేగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ‘బాహుబలి’ ని టీవీల్లో చూసిన వారంతా మళ్ళీ టిక్కెట్ కొని ఈ సినిమా చూడటానికి రాజమౌళి మాస్టర్ ప్లాన్ వెనుక ఒక ట్విస్ట్ ఉంది. 

‘బాహుబలి’ పార్ట్ వన్ ఇప్పుడు టికెట్ కొని చూసిన వారికి పార్ట్ 2 టికెట్ ను గ్యారంటీగా ఇప్పిస్తారట. అంటే పార్ట్ 2 సినిమా తొలివారంలో చూడాలనుకునేవారి కోసం పార్ట్ వన్ ను గ్యాలంగా వేస్తున్నారన్నమాట. ఏమైనా రాజమౌళి వేసే ఎత్తుగడలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: