తెలుగు ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్లు సినిమాలో సమంత చెల్లెలిగా కనిపించిన తెలుగు అమ్మాయి తేజస్విని మడివాడ.  ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తున్న ఈ అమ్మడికి రాంగోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ ఇచ్చాడు.  ఈ సినిమాలో ఓ సీన్ లో న్యూడ్ గా కనిపించిందని అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.  కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తేజస్వినికి మాత్రం పెద్దగా కలిసి రాలేదు.  
Image result for తేజస్విని మడివాడ
తర్వాత మరో సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వచ్చినా అది కూడా పెద్దగా కలిసి రాలేదు.  దీంతో హీరోయిన్ ఆఫర్ల కోసం హాట్ హాట్‌గా ఎన్ని ఫోటోషూట్లు చేస్తున్నా.. టాలీవుడ్ డైరెక్టర్ల కన్ను ఆమె మీద పడడం లేదు. అంతే కాదు ఈ అమ్మడికి సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా రావడంలో లేదు. దీంతో నిరాశలో ఉన్న తేజస్వినికి తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హంటర్ రీమేక్ ‘బాబు బాగా బిజీ’ హీరోయిన్ గా అవకాశం వచ్చింది.  
Image result for tejaswi madivada hot photoshoot
వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఈ మూవీలో తేజస్వి ఎంత బోల్డ్‌గా చేసిందనేది మూవీ ట్రైలర్‌తో తెలిసిపోయింది. టైలర్‌లోనే ఇలా వుంటే ఇక మూవీలో ఎలా వుంటుందా అని అంచనా వేస్తున్నారు యూత్.  మే 5న రిలీజ్ కానున్న మూవీతో  తెలుగులో మరిన్ని చాన్స్ లు వస్తాయని తెగ ఆశలు పెట్టుకుందట. మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ సాధిస్తుంది..ఈ తెలుగమ్మాయికి చాన్సులు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: