తెలుగు ఇండస్ట్రీలోకి ఎస్ఎంఎస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ రెజినా.  తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించింది.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఈ తమిళభామకు పెద్దగా పేరు తీసుకు రాలేక పోయాయి.  దీంతో తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంది.  అంతే కాదు బాలీవుడ్ లో కూడా ఈ హాట్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది.
Image result for rejina hare rama rare krishna
తాజాగా  సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్‌ రెడ్డి ఎన్‌ నిర్మాతగా కొత్త చిత్రం `హ‌రే రామ హ‌రే కృష్ణ‌`  శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.  


దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ - ''శ్రీమన్నారాయణ, ఢమరుకం, నక్షత్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది'' అన్నారు. 

Image result for rejina hare rama rare krishna

రెజీనా మాట్లాడుతూ - ''డిఫరెంట్‌ కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్‌.ఆర్‌.డిపార్ట్‌మెంట్‌లో కనపడే అమ్మాయి. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను. నా పాత్రను దర్శకుడు అర్జున్‌గారు బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాలో నా మదర్‌ పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ ఆమనిగారు నటిస్తున్నారు'' అన్నారు.  

దిలీప్‌ప్రకాష్‌ మాట్లాడుతూ - ''హీరోగా నా తొలి చిత్రమిది. తొలి సినిమానే మంచి సీనియర్స్‌ ఉన్న టీంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరో బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. 


ప్రకాష్‌రాజ్‌, ఆమని, నాజర్‌, కృష్ణభగవాన్‌, కాశీవిశ్వనాథ్‌, అలీ, పృథ్వీ, నాగినీడు, రచ్చరవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, కళ: బ్రహ్మకడలి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: నవీన్‌ రెడ్డి ఎన్‌, రచన-దర్శకత్వం: అర్జున్‌ సాయి


మరింత సమాచారం తెలుసుకోండి: