తెలుగు ఇండస్ట్రీలో సహజనటి,మహానటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు సావిత్రి.  తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా ఈమె చిత్రాలు హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి.  భారత దేశంలో చాలా కొద్దిమంది సీనియర్ నటీమణులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..అలాంటి వారిలో సావిత్రి ఒకరు.  చాలా మంది యంగ్ హీరోయిన్లు చాలా మంది సావిత్రిని ఆదర్శంగా తీసుకున్నామని అంటుంటారు..ఎందుకంటే ఆమె నటన అంత సహజంగా ఉంటుంది.  

అంత గొప్ప నటి పక్కన నిల్చున్న ఈ చిన్నారి ఎవరా అనుకుంటున్నారా..? జాతీయ నటుడు.. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాల్లో నటించినప్పటికీ తమిళ భాషలో ఎక్కువ సినిమాలు తీసిన విశ్వనటుడు కమల్ హాసన్.

కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: