దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఈరోజు ఉదయం కలిసి ఆయనకు పాదాభివందనం చేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో పవన్ మాట్లాడుతూ విశ్వనాథ్ సినిమాల గురించి మాట్లాడే అవగాహన తనకు లేకపోయినా ఈ ఆనందాన్ని ఎలా వ్యక్త పరచాలో తెలియక మాటలు రావడం లేదు అని అన్నాడు.

అంతేకాదు విశ్వనాథ్ సినిమాల్లో ‘శంకరాభరణం’, ‘స్వయం కృషి’, ‘స్వాతిముత్యం’, ‘శుభలేఖ’ తనకు చాల ఇష్టం అని అంటూ విశ్వనాథ్ తన అన్న చిరంజీవితో సినిమాలు తీసే సమయంలో తనకు యాక్టింగ్ కూడ రాదు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు పవన్. ఇదే సందర్భంలో పవన్ తో కలిసి వచ్చిన త్రివిక్రమ్ విశ్వనాథ్ కు ఒక అరుదైన బహుమతిని ప్రకటించాడు. 

విశ్వనాథ్ సినిమాలు అన్నీ గొప్ప చిత్రాలే అని అంటూ ఆయన సినిమాల్లోని 12 బెస్ట్ సినిమాలను ఒక డిస్క్ సెట్ గా తయారు చేసి లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్రింట్ చేసి ఆయన పట్ల తమకు ఉన్న ఇష్టాన్ని, గౌరవాన్ని ప్రదర్శించాలని అభిప్రాయపడుతున్నాం అంటూ త్రివిక్రమ్ తమ మనసులోని మాటను బయటపెట్టాడు.  అంతేకాదు ఈ డిస్క్ ను ఈ సంవత్సరమే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు త్రివిక్రమ్ తెలియచేసాడు. 

నిన్న మెగా స్టార్ చిరంజీవి విశ్వనాథ్ ను కలిసి అభినంధనలు తెలియచేస్తే తన అన్న అడుగుజాడలలోనే పయనిస్తూ ఈరోజు ఉదయమే పవన్ విశ్వనాథ్ అభినందనలు తెలియచేయడం బట్టి అన్ని విషయాలలోనూ పవన్ తన అన్న పను అనుసరిస్తున్నట్లే అనిపిస్తోంది. ఏది ఏమైనా కళా తపస్వికి వచ్చిన ఈ గౌరవం తెలుగు వారందరికీ గర్వకారణంగా ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: