రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న బాహుబలి-2 గురించి రెండు రోజులుగా ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదే బాహుబలి-2 ఇంటర్వల్ సీన్ లీక్ అయ్యిందని. రిలీజ్ ఒక్క రోజే కాబట్టి పెద్దగా నష్టం జరగదని చిత్రయూనిట్ అంత పట్టించుకోలేదు అనుకున్నారు కాని అసలు బాహుబలి-2 ఇంటర్వల్ సీన్ అంటూ వైరల్ గా వెళ్తున్న వీడియో ఏంటని చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది.


బాహుబలిలో శివగామి పాత్రతో సూపర్ క్రేజ్ సంపాదించిన రమ్యకృష్ణ ఓ యాడ్ లో నటించింది. ఆ యాడ్ నే పేరు మార్చి బాహుబలి ఇంటర్వల్ సీన్ గా ఎవరో ఫన్నిగా అప్లోడ్ చేశారు. ఈ వీడియో చూసి ఇదే బాహుబలి-2 ఇంటర్వల్ సీన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా ఎలార్ట్ అవుతున్న ప్రభాస్ రాజమౌళి ఫ్యాన్స్ నిజంగానే ఇంటర్వల్ సీన్ లీకయ్యిందేమో అనుకున్నారు.


కాని అసలు విషయం మాత్రం ఇదే అని తెలుస్తుంది. బాహుబలి ఇంటర్వల్ సీన్ అంటూ వచ్చిన ఈ వీడియో ఓ యాడ్ కోసం రమ్యకృష్ణ చేసింది. శివగామి కాస్టూంలో ఉండటం చేత ఇది నిజంగానే ఆ సినిమాలోది అని నమ్మేశారు. తీరా చూస్తే ఇది ఫేక్ అని తేలింది. బాహుబలి మీద ఉన్న క్రేజ్ ఏంటో ఈ వీడియో వ్యూయర్ కౌంట్ చూస్తే తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: