బాహుబలి-2' బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సునామీతో ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా 1000కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడంఖాయం అన్నమాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక ఈసినిమా సృష్టి కర్త ఈసినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలకు పైగా తన సమయాన్ని అంతా ఈసినిమా పైనే పెట్టిన దర్శకుడు రాజమౌళికి ఈసినిమా ద్వారా ఎంత పారితోషికం వచ్చింది అన్న ఆసక్తికర చర్చలకు ఇప్పుడు తెరలేచింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ‘బాహుబలి' ప్రాజెక్టు తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ దర్శకుడుగా మారిపోయాడు. 

అయితే ‘బాహుబలి’ కోసం ఎంతో కష్టపడ్డ రాజమౌళి ఈసినిమాకు సంబంధించిన రెండుభాగాలకు జరిగిన బిజినెస్ లో వచ్చిన లాభాలలో మూడోవంతు వాటాగా రాజమౌళికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు గత ఐదేళ్ల పాటు రాజమౌళికి సంబంధించిన పర్సనల్ ఖర్చులన్నీ నిర్మాతలే భరిస్తూ ప్రతినెలా రాజమౌళికి నెలకు 10 లక్షలు చొప్పున గత ఐదు సంవత్సరాలుగా ఈ మూవీ నిర్మాతలు రాజమౌళికి ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. 

దీనికితోడు ‘బాహుబలి’ పార్ట్ వన్ కు సంబంధించి చెప్పుకోతగ్గ లాభాలు నిర్మాతలకు రాలేదు అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ విషయంలో వచ్చిన అత్యధిక లాభాలలో రాజమౌళికి 30 శాతం వరకు పారితోషికంగా ఇవ్వబోతున్నట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాకు సంబంధించి రెండు పార్టులు కలిపి 450 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అని ఫిలింనగర్ టాక్. 

అయితే ఒక్క పార్ట్ 2 ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు 500కోట్ల వరకు జరిగిన నేపధ్యంలో ఈసినిమాకు వస్తున్న అనూహ్య స్పందన వల్ల ఈసినిమా నిర్మాతలకు ఈసినిమాను ప్రపంచంలోని వివిధ భాషలలోకి డబ్ చేయబోతున్న సందర్భం వల్ల ఇతరిత్రా కారణాలు వల్ల ఈసినిమా నిర్మాతలకు ‘బాహుబలి 2’ వల్ల వందల కొట్లలో లాభాలు వచ్చేఆస్కారం ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈవార్తలను బట్టి 30 శాతం లాభాలలో వాటా తీసుకుంటున్న రాజమౌళికి ఎవ్వరూ ఊహించని స్థాయిలో అత్యంత భారీ పారితోషికం వచ్చే అవకాసం ఉంది అనిఅంటున్నారు. 

ఇదిఇలా ఉండగా రాజమౌళి ‘బాహుబలి 2’ తరువాత దర్శకత్వం వహించబోయే సినిమా నిర్మాతలు ఎవరు అన్న విషయం పై కూడ ఊహాగానాలు మొదలై పోయాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజమౌళి దగ్గర పూర్వాశ్రమంలో ఎప్పుడో తీసుకున్న రెండు అడ్వాన్స్ లు ఉన్నాయి అని టాక్.  వాటిలో ఒకటి డివివి దానయ్య, మరొకటి కేఎల్ నారాయణ ఇచ్చారు అని అంటారు. దీనితో వీరిద్దరికీ కలిపి ఒకమీడియం రేంజ్ సినిమా తీసి రాజమౌళి తన బాధ్యతను నెరవేర్చుకుంటాడు అని కొందరు అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇప్పటికే రాజమౌళికి ఓ హాలీవుఢ్ కంపెనీ అన్ని లాంగ్వేజ్ ల్లో కలిపి ఓ భారీ ప్రాజెక్టును చేసి పెట్టమని అడుగుతోందని ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే రాజమౌళి పారితోషికం 100 కోట్లకు పైగా ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా ప్రస్తుతానికి రాజమౌళి ‘బాహుబలి 2’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: