ప్రస్తుతం తెలుగు సినిమా రికార్డులనే కాదు ఇండియన్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా బాహుబలి సంచలనాలు సృష్టిస్తుంది. 2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటికే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఛత్రపతి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగాడు.


రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి. అప్పటిదాకా ప్రభాస్ స్టార్ హీరోగా ఉన్నా అతన్ని అగ్రస్థానంలో నిలిచేలా చేసింది ఛత్రపతి మూవీ. మధ్యలో పౌర్ణమి, యోగి, మున్నా నిరాశపరచడంతో పూరి జగన్నాధ్ డైరక్షన్ లో బుజ్జిగాడుగా డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు.


2010లో వచ్చిన ప్రభాస్ డార్లింగ్ మూవీ తన కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ప్రభాస్ హిట్ ఖాతాలో చేరింది. `ఇక ఆ తర్వాత రెబల్ ఫ్లాప్ అయినా కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన మిర్చి మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. 


ఇక రాజమౌళితో చేసిన బాహుబలి ఒకటి రెండు పార్ట్ లతో ప్రభాస్ ఏ రేంజ్ కు వెళ్లాడో మనకు తెలిసిందే. రికార్డుల చెడుగుడు ఆడుతున్న బాహుబలి కన్ క్లూజన్ కేవలం రాజమౌళి దర్శకత్వ ప్రతిభ మాత్రమే కాదు ప్రభాస్ ఎనలేని కష్టం కూడా ఉంది. అది స్క్రీన్ మీద కనబడుతుంది కూడా.


ఇక ఇప్పటిదాకా ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తూ.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బాహుబలి మూవీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక సౌత్ లో ఎలా ఉన్నా టాలీవుడ్ టాప్ చైర్ అదేనండి నెంబర్ 1 ప్లేస్ ప్రభాస్ కు ఇచ్చేయొచ్చు అంటున్నారు. 


దర్శకుడు కలను తెర మీద ఆవిష్కరించే హీరో.. ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాడని ప్రభాస్ ను చూస్తే అర్ధమవుతుంది. బాహుబలి కోసం ఐదేళ్ల కెరియర్ కేటాయించిన ప్రభాస్ దానికి ఫలితంగా రెట్టింపు క్రేజ్ దక్కించుకున్నాడు. తెలుగు సినిమా చరిష్మా ప్రపంచానికి చాటిచెప్పిన ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ అని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ వరకు ఇది పండుగ చేసుకునే వార్త అయినా మిగతా హీరోల ఫ్యాన్స్ మాత్రం కస్సుబుస్సు మంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: