ప్రేక్షకుల పల్స్ పట్టుకునే దర్శకులు తెలుగు పరిశ్రమలో చాలా తక్కువమంది ఉన్నారు. కొందరు కథ కథనాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా మరికొందరు తమ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులు శభాష్ అనేలా చేసుకుంటారు. ఓవరాల్ గా సినిమా నచ్చాల్సింది ఆడియెన్స్ కే కాబట్టి వారికి నచ్చేలానే తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు.  


ఇక ఏ జానర్ సినిమా అయినా సరే చూస్తున్న ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసేలా డైరెక్షన్ చేస్తాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని సినిమా సినిమాకు పెంచుతూ వస్తున్న జక్కన్న బాహుబలితో తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించాడు. తెలుగు సినిమాలు సాంకేతిక నిపుణుల ప్రతిభను తారాస్థాయిలో నిలబెట్టి ప్రపంచ సినిమా మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు.


దర్శకత్వ ప్రతిభలో రాజమౌళి ఎప్పుడో టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. అయితే పిరియాడికల్ సినిమాల్లో ఇప్పటికే వేలు పెట్టిన గుణశేఖర్, క్రిష్ లు చేయలేని పని ఓ ఊహాజనిత కథను నిజంగా జరిగింది అన్నట్టుగా అద్భుత కళాఖండంగా చూపించాడు రాజమౌళి. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన రుద్రమదేవి గొప్ప చరిత్ర కలిగినది. అందులోనూ అనుష్క లీడ్ రోల్ లో చేసిన మూవీ. అయినా సరే గోన గన్నారెడ్డి పాత్ర మీద దృష్టి పెట్టినట్టుగా మిగతా పాత్రలు కథనాల మీద అంత ఏకాగ్రత చూపించలేకపోయాడు గుణశేఖర్.    


ఇక క్రిష్ రూపొందించిన శాతకర్ణి సినిమా కూడా అంతే.. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు ఉన్నా అవి అంతగా ప్రభావితం చూపవు. పిరియాడికల్ మూవీస్ లో రాజమౌళి టేకింగ్ అద్భుతమని చెప్పొచ్చు. ఆడియెన్స్ ను కథలో ఇన్వాల్వ్ చేసే తీరు గొప్పగా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ ఉంటే వీరత్వం లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇలా కథలోనూ.. క్యారక్టర్ లోనూ ఫాలో అయ్యేలా స్క్రీన్ ప్లే రచించి మెప్పిస్తాడు రాజమౌళి. ఇదే రాజమౌళి అసలు సక్సెస్ సీక్రెట్. ఈ విధానాన్ని యాజిటీజ్ ఫాలో అవ్వకపోయినా ఓ పిరియాడికల్ మూవీ ప్రేక్షకుల మెప్పుపొందేలా తీయాలంటే కచ్చితంగా రాజమౌళి బాహుబలిని మార్గాలను అనుసరించాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: